ఓ మైగాడ్ - ఒక్క నిమిషానికి రూ.కోటి, కళ్లు తిరిగే పారితోషికం తీసుకుంటున్న ఆ హీరోయిన్?
ఒక్కసారి ఊహించుకోండి.. నిమిషానికి రూ.కోటి రూపాయాలు సంపాదిస్తే లైఫ్ ఎలా ఉంటుందో. ఇంతకీ అలా సంపాదిస్తున్న ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
మన మూవీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్లకు చాలా తక్కువ పారితోషికం ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్లకు లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తారు. మాంచి పాపులర్, స్టార్ హీరోయిన్లకైతే రూ.కోటి వరకు ఉంటుంది. కొంతమంది హీరోయిన్లు వారు ఆ మూవీకి కేటాయించే సమయానికి తగినట్లుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. మరికొందరు ఐటమ్ సాంగ్స్‌కు ప్రత్యేకంగా ఒక రేట్‌ను ఫిక్స్ చేసుకుంటారు. ఈ రేటు రెగ్యులర్‌గా సినిమాల్లో నటించేందుకు తీసుకొనే అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. స్పెషల్ సాంగ్స్ లేదా ఐటెమ్ సాంగ్స్ తమ కెరీర్‌కు ఇబ్బందికరంగా మారుతాయనే ఉద్దేశంతో ముందుచూపుగా వాటికి ప్రత్యేకమైన ధరను ఏర్పాటు చేసుకుంటున్నారు మన హీరోయిన్లు.
ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ హీరోయిన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె ఒక్క నిమిషం సినిమాలో కనిపించడానికి రూ.1 కోటి వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె మరెవ్వరో కాదు.. ‘వాల్తేరు వీరయ్య’లో ‘‘వేరీజ్ ది పార్టీ..’’ అంటూ చిందులేసిన ఐటెమ్ భామ్మ ఊర్వశీ రౌతేలా. ఔనండి.. ఈమె నిమిషానికి రూ.కోటి చొప్పున వసూలు చేస్తుందట.
‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ఒక్క సాంగ్‌లో కనిపించేందుకు ఊర్వశీ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఆ మూవీ హిట్ కొట్టడంతో ఊర్శశీకి టాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీలో ‘‘వైల్డ్ సాలా..’’ అంటూ డ్యాన్స్ ఇరగదీసింది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘బ్రో’ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో కూడా ఊర్వశీ మెరిసింది. సితార మంజరీగా ఆకట్టుకుంది.
‘బ్రో’ మూవీతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘స్కంద’ మూవీలో కూడా ఊర్వశీ రౌతేలా ఛాన్స్ కొట్టేసిందట. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్‌లో 3 నిమిషాలు కనిపించేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో నిమిషానికి రూ.కోటి చొప్పున వసూలు చేస్తోంది ఈ బ్యూటీ అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో వాస్తవం ఏమిటనేది ఆమెకే తెలియాలి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ తీసుకుంటున్న మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బ్యూటీస్ లిస్ట్‌లో ఇప్పుడు ఊర్వశీ టాప్‌లో ఉంది.
View this post on Instagram
ఊర్వశి 2013లో సన్నీ డియోల్ నటించిన 'సింగ్ సాబ్ ది గ్రేట్' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె 'సనమ్ రే', 'గ్రేట్ గ్రాండ్ మస్తీ', 'హేట్ స్టోరీ 4', 'పాగల్‌పంతీ' బోల్డ్ హీరోయిన్‌గా నటించింది. కన్నడంలో 'మిస్టర్’, ‘ఐరావత’, తమిళంలో 'ది లెజెండ్'తో మూవీలో నటించింది. అయితే, తెలుగులో మాత్రం ఐటెమ్ సాంగ్స్‌తోనే సరిపెట్టుకుంటోంది. మన నిర్మాతలు కూడా ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం పేరున్న, మాంచి ఫాలోయింగ్ ఉన్న ఐటెమ్ భామలకు కొరత కూడా ఉండటంతో ఊర్వశీ రౌతేలా టైమ్ నడుస్తోంది.
Read Also: మీరు గే కదా, నిజమేనా? నెటిజన్ ప్రశ్నకు కరణ్ జోహార్ ఊహించని సమాధానం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial