Mansoor Ali Khan: త్రిషాపై మన్సూర్ పరువు నష్టం దావా - సంస్కారహీనమంటూ హైకోర్టు చివాట్లు
Trisha : త్రిషపై తను చేసిన కామెంట్స్‌ను కామెడీగా తీసుకోలేదని మద్రాసు హైకోర్టులో పరువునష్టం దావాను వేశాడు మన్సూర్ అలీ ఖాన్. కానీ అది తిరిగి తనకే బ్యాక్‌ఫైర్ అయ్యింది.
Mansoor Ali Khan Trisha Case : కోలీవుడ్‌లోనే కాదు మొత్తం సౌత్ సినీ పరిశ్రమలోనే సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సెన్సేషన్‌గా మారాయి. ఓపెన్‌గా ఈ నటుడు చేసిన రేప్ కామెంట్స్‌పై త్రిషాతోపాటు సెలబ్రిటీలంతా ఖండించారు. మహిళా సంఘాలు సైతం ఫైర్ అయ్యాయి. మాన్సూర్‌పై కేసులు కూడా పెట్టాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో త్రిషకు సారీ చెప్పాడు మన్సూర్ అలీ ఖాన్. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో త్రిషపై పరువునష్టం దావా వేశాడు మన్సూర్. తాజాగా మద్రాస్ హైకోర్టు.. మన్సూర్ పెట్టిన కేసుపై స్పందించింది.
కొట్టిపారేసిన మద్రాసు హైకోర్టు..
తాజాగా త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ పెట్టిన పరువునష్టం దావా కేసును మద్రాసు హైకోర్టు కొట్టిపారేసింది. అంతే కాకుండా త్రిషనే ముందుగా తనపై కేసు పెట్టాల్సింది అని సీరియస్ అయ్యింది. ఈ కేసు ముందుగా ‘లియో’ సినిమా ప్రమోషన్స్ సమయంలో మొదలయ్యింది. ‘లియో’ చిత్రంలో త్రిషతో తనకు రేప్ సీన్స్ లేవని డిసప్పాయింట్ అయ్యానని, తను చేసిన ఇతర సినిమాల్లో చాలామంది హీరోయిన్స్‌తో ఉన్నట్టుగా త్రిషతో లేకపోవడం తనకు బాధ కలిగించిందని ఓపెన్‌గా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశాడు మన్సూర్. కేవలం త్రిషపై మాత్రమే కాదు.. అప్పట్లో రోజా, ఖుష్భూ లాగా సీనియర్ నటీమణులపై కూడా మన్సూర్.. ఇలాంటి కామెంట్సే చేశాడు.
సంస్కారహీనమైన ప్రవర్తన..
డిసెంబర్ 10న మన్సూర్ అలీ ఖాన్ చేసిన పరువునష్టం దావాపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ‘మీరు యాక్టర్ అయినప్పుడు యూత్ అంతా మిమ్మల్ని రోల్ మోడల్‌లాగా చూస్తారు. ఇలా సంస్కారహీనంగా ప్రవర్తించడం మీకు కరెక్టా?’ అని మండిపడింది. అంతే కాకుండా మన్సూర్ తరపున వాదించే న్యాయవాదిపై సీరియస్ అయ్యి.. పబ్లిక్ ప్రదేశాల్లో నటుడు ఎలా ప్రవర్తించాలో చెప్పమని ఆదేశించింది. త్రిషపై తాను చేసిన కామెంట్స్ అందరూ ఖండించడం మొదలుపెట్టిన తర్వాత ఒక సారీ చెప్పేస్తే.. అంతా ముగిసిపోతుందని మన్సూర్ అలీ ఖాన్‌కు చాలామంది సలహా ఇచ్చారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టినా కూడా సారీ మాత్రం చెప్పలేదు మన్సూర్.
తిరిగి తనకే తిట్లు..
ప్రెస్ మీట్ పెట్టిన మన్సూర్ అలీ ఖాన్.. కామెడీ చేస్తే కూడా సారీ చెప్పాలా? అని ఎదురుప్రశ్న వేశాడు. వాళ్లు కావాలనే తనను రెచ్చగొడుతున్నారని, తనతో పెట్టుకోవడం మంచిది కాదని ఇన్‌డైరెక్ట్‌గా అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సారీ చెప్పకపోగా.. ప్రెస్ మీట్ పెట్టి తాను చేసిన కామెంట్స్‌ను కామెడీ అనడంతో అందరూ ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో మన్సూర్ అలీ ఖాన్‌కు వేరేదారిలేక సారీ చెప్పాడు. త్రిష కూడా ఓపెన్‌గా తన సారీని ఒప్పుకుంటున్నట్టుగా ట్వీట్ చేసింది. అంతా అయిపోయింది అనుకునే సమయానికి తన పరువు పోయిందంటూ పరువు నష్టం దావాతో ముందుకొచ్చిన మన్సూర్ అలీ ఖాన్.. మళ్లీ తనంతట తానుగా పరువు పోగొట్టుకున్నాడు.
Also Read: పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను - వెంకటేష్ మహా వార్నింగ్!