![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mansoor Ali Khan: కోర్టులో మన్సూర్ అలీ ఖాన్‌కు ఎదురుదెబ్బ - ముందస్తు బెయిల్ తిరస్కరణ
Trisha - Mansoor Ali Khan: త్రిషపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు మన్సూర్ అలీ ఖాన్‌కు శిక్ష పడకతప్పేలా లేదు. కోర్టు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది.
![Mansoor Ali Khan: కోర్టులో మన్సూర్ అలీ ఖాన్‌కు ఎదురుదెబ్బ - ముందస్తు బెయిల్ తిరస్కరణ mansoor ali khan anticipatory bail plea gets rejected in chennai sessions court Mansoor Ali Khan: కోర్టులో మన్సూర్ అలీ ఖాన్‌కు ఎదురుదెబ్బ - ముందస్తు బెయిల్ తిరస్కరణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/23/de9fc4c7bf362bfccc5459f1dd399ac91700740981197802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్.. తన సహ నటి త్రిషపై చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చెన్నై పోలీసులు సైతం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. చెన్నైలోని ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో మన్సూర్ అలీపై కేసు నమోదయ్యింది. సెక్షన్ 354ఏ (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) సెక్షన్స్ కింద చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అందుకే ముందస్తు చర్యగా మన్సూర్ తరపున లాయర్.. తనకు ముందస్తు బెయిల్‌ను దాఖలు చేశారు. కానీ అక్కడ కూడా ఈ నటుడికి ఎదురుదెబ్బే తగిలింది.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు..
చెన్నైలోని ఉమెన్ పోలీస్ స్టేషన్ నుంచి మన్సూర్ అలీ ఖాన్‌కు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. నవంబర్ 23న విచారణకు రమ్మని పోలీసులు కోరారు. కానీ ముందుగా తన ఆరోగ్యం బాలేదని, విచారణకు రాలేనని చెప్పిన మన్సూర్.. ఆ తర్వాత పోలీసుల ముందు హాజరయ్యాడు. మన్సూర్ లాయర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌లో కొన్ని తప్పులు ఉండడం వల్ల దానిని ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయన పోలీసుల ముందుకు హాజరు అవ్వక తప్పలేదు. తప్పులతో కూడిన బెయిల్ పిటీషన్‌ను ఫైల్ చేసినందుకు, కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు చెన్నై సెషన్స్ కోర్టు.. మన్సూర్‌ను మందలించింది కూడా. పోలీసుల ముందు హాజరైనా కూడా మన్సూర్.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారని కొన్ని లోకల్ ఛానెళ్లు రిపోర్ట్ చేస్తున్నాయి.
ఇంట్లో విచారణ..
త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలంటూ, ఆయనకు కఠిన శిక్ష వేయాలంటూ నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) ముందుగా తమిళనాడు డీజీపీని ఆశ్రయించింది. ఆ తర్వాత విచారణలో భాగంగా పోలీసులు మన్సూర్ ఇంటికి వెళ్లారు. ‘లియో’ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. మన్సూర్ కూడా ఒక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాలో తనకు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశించానని, ఇంతకు ముందు తాను ఎంతోమంది హీరోయిన్స్‌తో చేసినట్టుగా త్రిషను కూడా ఎత్తుకొని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లే సీన్‌లో నటిస్తానని అనుకున్నానని మన్సూర్ ఓపెన్‌గా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేయడంతో పాటు ఆయన పోలీసుల ముందు నిలబడేలా చేశాయి.
ఖండించిన సెలబ్రిటీలు..
మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు త్రిషతో పాటు సినీ పరిశ్రమలోని ఎంతోమంది సెలబ్రిటీలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. త్రిష అయితే ఇంకెప్పుడూ తనతో కలిసి నటించను అంటూ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సైతం మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం కోలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై స్పందించారు. సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో పాటు చిన్మయి, అర్మాన్ మాలిక్ లాంటి సింగర్స్ కూడా ఈ విషయంపై మాట్లాడడానికి ముందుకొచ్చారు.
Also Read: డాగ్ స్క్వాడ్‌తో పవర్ స్టార్ ఆటలు, నెట్టింట్లో వీడియో వైరల్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)