By: ABP Desam | Updated at : 28 Feb 2023 12:03 PM (IST)
అజయ్ భూపతి, 'మంగళవారం' కాన్సెప్ట్ పోస్టర్
'ఆర్ఎక్స్ 100' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడి మొదలైందని చెప్పాలి. ప్రేమ కథలు, రొమాంటిక్ గీతాలను తెరకెక్కించే విధానంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'మంగళవారం' (Mangalavaram Movie). ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
'మంగళవారం'తో నిర్మాతగా అజయ్ భూపతి
'మంగళవారం' సినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా మారారు. 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన... ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమది పాన్ ఇండియా సినిమా కాదని, సౌత్ ఇండియన్ మూవీ అని చిత్ర బృందం పేర్కొంది.
ఇండియాలో ఎవరూ ట్రై చేయని జానర్
'మంగళవారం' కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... సీతాకోక చిలుక మధ్యలో ఓ అమ్మాయిని చూపించారు. అయితే, ఆ అమ్మాయి ఎవరనేది స్పష్టంగా కనిపించలేదు. ఈ సినిమాలో నటీనటుల వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు. త్వరలో హీరో హీరోయిన్ల వివరాలు చెబుతామన్నారు. సినిమాలో మొత్తం 30 కీలక పాత్రలు ఉన్నాయని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.
Also Read : భార్య, పిల్లలతో తారకరత్న లాస్ట్ ఫోటో ఇదే - ఎమోషనల్ అయిన అలేఖ్యా రెడ్డి
'కాంతార' అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో...
చిత్ర నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ''అజయ్ భూపతి 'ఆర్ఎక్స్ 100'తో ప్రేక్షకులను ఎలా అయితే సర్‌ప్రైజ్ చేశారో, ఈ 'మంగళవారం' చిత్రంతోనూ అదే విధంగా సర్‌ప్రైజ్ చేస్తారు. కాన్సెప్ట్ & కంటెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని తెలిపారు.
Also Read : ఎన్టీఆర్‌ను పిలిచాం కానీ - టాలీవుడ్ ఫ్యాన్ వార్ దెబ్బకు హాలీవుడ్ రియాక్షన్
Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
It's a PAN-SOUTH INDIAN movie🔥
'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
పాయల్ పేరు చెప్పలేదు ఎందుకు?
'ఆర్ఎక్స్ 100'తో పంజాబీ అమ్మాయి, కథానాయిక పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ను అజయ్ భూపతి తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్లాయి. విక్టరీ వెంకటేష్ సరసన 'వెంకీ మామ', మాస్ మహారాజా రవితేజకు జోడీగా 'డిస్కో రాజా' వంటి భారీ చిత్రాలు చేశారు. అయితే, కొన్నాళ్లుగా ఆమె జోరు తగ్గింది. 'మంగళవారం'లో పాయల్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నట్లు తెలిసింది. అజయ్ భూపతితో మళ్ళీ వర్క్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆమె వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆమె పేరు దర్శక నిర్మాతలు ప్రకటించలేదు. బహుశా... సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఏమైనా ప్లాన్ చేశారేమో!?
ఈ చిత్రానికి కళా దర్శకత్వం : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ అండ్ ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, అజయ్ భూపతి, కథ - కథనం - దర్శకత్వం : అజయ్ భూపతి.
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !