అన్వేషించండి

Kannappa First Look: శివరాత్రి స్పెషల్ - కన్నప్ప ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌, ఆకట్టుకుంటున్న మంచు విష్ణు ఇంటెన్సీవ్‌ లుక్‌

Manchu Vishnu Kannappa Movie: శివభక్తుడు కన్నప్ప జీవిత కథగా వస్తున్న ఈ సినిమా నుంచి శివరాత్రి సందర్భంగా సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

Kannappa First Look: చాలా గ్యాప్‌ తర్వాత మంచు మనోజ్‌ నటిస్తున్న చిత్రం కన్నప్ప. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్‌ వారియర్‌, ది అల్టిమేట్‌ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఒక్కొ అప్‌డేట్‌ ఇస్తూ బజ్‌ క్రియేట్‌ చేస్తుంది మూవీ టీం. శివభక్తుడు కన్నప్ప జీవిత కథగా వస్తున్న ఈ సినిమా నుంచి శివరాత్రి సందర్భంగా సరప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

నేడు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. చెప్పినట్టుగా శివరాత్రి కానుకగా మార్చి 8న మధ్యాహ్నం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. పరమశివుని గొప్ప భక్తుడైన ‘కన్నప్ప’గా చిత్రీకరించే గౌరవం, ప్రత్యేకత ఇది. ఈరోజు మహాశివరాత్రి, ఇదిగో మీ ‘కన్నప్ప’ అంటూ మంచు విష్ణు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్ చేశాడు. ఇందులో విష్ణు బాణం వదులుతూ ఇంటెన్సివ్‌ లుక్‌లో కనిపించాడు. అది వాటర్‌ ఫాల్‌ నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

దాదాపు కన్నప్పు షూటింగ్‌ను విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ జరపుకోగా థాయిలాండ్‌కి చెందని ప్రముఖ టెక్నికల్ టీమ్ భాగమయ్యింది. మొత్తం 600 మంది హాలీవుడ్ ప్రముఖులు ఇందులో పని చేశారు. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేశారు. రెండో షెడ్యూల్ కోసం ఇండియాకు వస్తున్నట్లు ఇటీవల మంచు మోహన్ బాబు తెలిపిపన సంగతి తెలిసిందే. కాగా మంచు ఫ్యామిలీకి చెందిన మూడు జనరేషన్‌తో ఈ కన్నప్ప మూవీ తెరకెక్కుతుండటం విశేషం. దీంతో మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్‌ శివుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. 

Kannappa Movie Cast And Crew: తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు కన్నప్ప సిద్ధపడిన శ్రీ కాళహస్తి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 'కన్నప్ప'లో శివ పార్వతుల పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే, మోహన్ బాబు & శరత్ కుమార్ సైతం కీలక పాత్రలు పోషించనున్నారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో హీరోయిన్లలో కొందరు కూడా 'కన్నప్ప'లో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.  

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ 'కన్నప్ప'కు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. లెజెండరీ రచయితలు పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ కథకు హంగులు అద్దారు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Embed widget