Kannappa First Look Update: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఫస్ట్‌లుక్ అప్‌డేట్ - మహాశివరాత్రికి సర్‌ప్రైజ్ చేయబోతున్న టీం
Kannappa First Look: శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు.
![Kannappa First Look Update: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఫస్ట్‌లుక్ అప్‌డేట్ - మహాశివరాత్రికి సర్‌ప్రైజ్ చేయబోతున్న టీం Manchu Vishnu Kannappa First Look will Be Launch On Maha Shivaratri March 8th 2024 Kannappa First Look Update: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఫస్ట్‌లుక్ అప్‌డేట్ - మహాశివరాత్రికి సర్‌ప్రైజ్ చేయబోతున్న టీం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/ccc4e208586b6711f48f5fc3b2f429f41709816242210929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kannappa First Look Launch Tomorrow: మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్‌ను విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరపుకోగా ఈ షెడ్యూల్లో థాయిలాండ్ కు చెందిన టెక్నికల్ టీమ్ భాగమయ్యింది. మొత్తం 600 మంది హాలీవుడ్ హాలీవుడ్ ప్రముఖులు పని చేశారు. న్యూజిలాండ్ లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాను షూట్ చేశారు. రెండో షెడ్యూల్ కోసం ఇండియాకు వస్తున్నట్లు ఇటీవల మంచు మోహన్ బాబు తెలిపారు.
కాగా మంచు ఫ్యామిలీకి చెందిన మూడు జనరేషన్‌తో ఈ కన్నప్పు తెరకెక్కుతుండటం విశేషం. దీంతో మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మహా శివరాత్రి కానుకగా.. మార్చి 08 మధ్యాహ్నం 2.55 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో అగ్ర హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు అధికారికంగా వెల్లడించారు. కన్నప్ప మొదట నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారతాడు. ఇక అతడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు అనేదే కన్నప్ప కథ. ఈ కథ ముందే తెలిసిన ఈ మైథలాజికల్ చిత్రానికి గ్రాఫిక్స్, వీఎఫ్‌వర్క్‌కి పెద్ద పీట వేస్తున్నారు. పాన్ ఇండియా భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. మరి ఈ మూవీ విజువల్ వండర్‌గా అబ్బురపరుస్తుందా? ఆదిపురుష్‌లా నిరాశ పరుస్తాందా? చూడాలి.
Star-studded #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 First Look Tomorrow!#Vishnumanchu pic.twitter.com/oj8cxgriry
— KLAPBOARD (@klapboardpost) March 7, 2024
యోధుడిగా... అపర భక్తుడిగా!
'కన్నప్ప' విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్! హాలీవుడ్ స్థాయిలో తీయాలని ఉందని ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఈ సినిమాకు కథ కూడా ఆయన స్వయంగా అందించారు. ఇవాళ విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే... కన్నప్పను యోధుడిగా, అపర భక్తుడిగా చూపిస్తున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమాపై లుక్ అంచనాలు పెంచిందని చెప్పవచ్చు. 'కన్నప్ప'లో 80 శాతం సన్నివేశాలను న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాలలో జరుగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విష్ణు మంచు కూడా అక్కడే ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ''న్యూజిలాండ్ దేశంలోని ప్రకృతి, ఆ వాతావరణం, అందమైన ప్రదేశాలను మా సినిమాలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. మైథాలజీ నేపథ్యంలో సన్నివేశాలకు న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సరిపోతుంది'' అని చెప్పారు. హాలీవుడ్ క్లాసిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' షూటింగ్ జరిగిన ప్రదేశాలలో 'కన్నప్ప' చిత్రీకరణ జరుగుతుండటం విశేషం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)