Manchu Vishnu: 'మా' అసోసియేషన్‌కు మంచు విష్ణు భారీ విరాళం - కూతురు బర్త్‌డే సందర్భంగా కళాకారుల కోసం..
Manchu Vishnu: హీరో మంచు విష్ణు మా అసోసియేషన్‌కు భారీ విరాళం అందించారు. ఆయన కూతురు బర్త్‌డే సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన కళాకారుల కోసం రూ. 10 లక్షల విరాళాన్ని ఇచ్చారు.
![Manchu Vishnu: 'మా' అసోసియేషన్‌కు మంచు విష్ణు భారీ విరాళం - కూతురు బర్త్‌డే సందర్భంగా కళాకారుల కోసం.. Manchu Vishnu Donates Rs 10 Lakh to MAA Manchu Vishnu: 'మా' అసోసియేషన్‌కు మంచు విష్ణు భారీ విరాళం - కూతురు బర్త్‌డే సందర్భంగా కళాకారుల కోసం..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/00bcb83ccb597cc37e3249c7a4fe66161723296676345929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manchu vishnu Donates Rs 10 Lakh to MAA: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మా అధ్యక్షుడిగా ఆయన కళాకారుల కోసం ఎప్పటికప్పుడు సంక్షేమ ర్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చిన్న తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా మా అసోషియేషన్‌కు రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ డబ్బును అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం అందించారు.
కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన మద్దతు, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. కాగా గత మూడు ఏళ్లుగా మా అధ్యక్షుడిగా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన నాయకత్వం మా ఈ మూడేళ్లలో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. అంతేకాదు 'మా' భవనంపై కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు. యూట్యూబ్ నటీనటులపై వచ్చే ట్రోల్స్‌ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు.
View this post on Instagram
అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసి వాటిపై బ్యాన్ విధించారు. నటినటులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మంచు విష్ణు చేపట్టిన ఈ చర్యలపై పక్క ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు సైతం ప్రశంసించారు. విష్ణు తీసుకున్న ఈ నిర్ణయాత్మక చర్య అతని నాయకత్వానికి ప్రతీకగా నిలిచింది. కాగా ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నారు. ఆయన డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర ఇండస్ట్రీలకు చెందిన అగ్ర నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, మలయాళ సూపర స్టార్ మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటి మధుబాల, శరత్‌కుమార్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
డిసెంబర్‌లోనే కన్నప్ప రిలీజ్
అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 2024 రిలీజ్ చేస్తామని మంచు గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే 'హర హర మహాదేవ్' అంటూ ట్వీట్ చేసి అందరిలో ఆసక్తి పెంచారు. కాగా అప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప 2', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లతో పాటు నితిర్ రాబిన్ హుడ్ చిత్రాలు కూడా డిసెంబర్‌లో విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలకు పోటీగా మంచు విష్ణు కన్నప్పను రిలీజ్ చేస్తాడా? లేక వాయిదా వేస్తాడా? చూడాలి.
Also Read: రెండు నెలల ముందే వచ్చేస్తోన్న 'కంగువ' ట్రైలర్ - రిలీజ్ ఎప్పుడంటే...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)