By: ABP Desam | Published : 18 Apr 2022 09:26 AM (IST)|Updated : 18 Apr 2022 09:30 AM (IST)
మోహన్ బాబు, లక్ష్మీ మంచు
'పద్మశ్రీ' పురస్కార గ్రహీత - కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుమార్తె - విలక్షణ నటి మంచు లక్ష్మీ ప్రసన్న తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ రూపొందించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. రెండు నెలలు ఏకధాటిగా షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
"నాన్నతో షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. వచ్చే రెండు నెలలు ఒత్తిడి తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇంతకు మునుపెన్నడూ చూడని పాత్రల్లో మోహన్ బాబు, లక్ష్మి మంచు కనిపిస్తారని చిత్రబృందం అంటోంది.
Also Read: మంచు విష్ణు అస్సలు తగ్గడం లేదుగా! ఇన్‌స్టా వీడియో చూశారా?
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డైమండ్' రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.
'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో ఈ ఏడాది మోహన్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే... వసూళ్ల పరంగా నిరాశ పరిచింది. సినిమా ప్లాప్ అయ్యింది. నటుడిగా మోహన్ బాబు ప్రయోగం చేశారు. ఎక్కువ శాతం సన్నివేశాల్లో ఆయన ఒక్కరే కనిపించారు. ఈసారి అటువంటి ప్రయోగం చేయకుండా కొత్త తరహా కథ, కథనాలతో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Lakshmi Manchu (@lakshmimanchu)
Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
NTR30 : ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో మార్పులు - మే 20న అప్‌డేట్ వస్తుందా?
Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో
Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్