అన్వేషించండి

Manchu Lakshmi: మంచు లక్ష్మి వైరల్ వీడియో, నేను ఆర్టిస్ట్‌ను కాదు అంటూ నటి పోస్ట్

మంచు లక్ష్మి ఏం చేసినా అది ఒక మీమ్ కంటెంటే అని నమ్మే నెటిజన్లు చాలామంది ఉంటారు. ఈ విషయాన్ని తను కూడా నమ్ముతుంది.

మీమ్స్, రీల్స్ అనేవి సామాన్యుల మీద కంటే సినీ సెలబ్రిటీల మీదే ఎక్కువ వస్తాయి. కానీ చాలా తక్కువమంది సినీ సెలబ్రిటీల ఆఫ్ స్క్రీన్ బిహేవియర్‌ను మీమ్ చేసే ఛాన్స్ ఉందని మీమర్స్ ఎదురుచూస్తుంటారు. అందులో ఒకరు మంచు లక్ష్మి. మంచు ఫ్యామిలీ ఏం చేసినా అది ఒక మీమ్ మెటీరియల్ అని నెటిజన్లు అంటుంటారు. అందులో ముఖ్యంగా మంచు లక్ష్మి అయితే మీమర్స్‌కు కొన్నాళ్ల వరకు బోర్ కొట్టని కంటెంట్ ఇస్తుంది. తాజాగా సైమా అవార్డ్ వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై మంచు లక్ష్మి ప్రవర్తన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అందులో తన మాటలను చూసి నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు. దీంతో మంచు లక్ష్మి కూడా ఈ వైరల్ వీడియోపై రియాక్ట్ అయ్యింది.

అప్పుడప్పుడు సెలబ్రిటీలు పెద్దగా ఆలోచించకుండా మాట్లాడే మాటలు మీమ్ కంటెంట్ అవుతాయన్నది వారికి కూడా తెలిసిన విషయమే. ఒకప్పుడు సెలబ్రిటీలపై వేసే మీమ్స్‌ను వారు ఫాలో అయ్యేవారు కాదు. కానీ రోజులు మారిపోయాయి. మెల్లగా ఆ మీమ్స్ వైరల్ అవుతూ.. సెలబ్రిటీల వరకు వెళ్తున్నాయి. మంచు లక్ష్మి విషయంలో కూడా అదే జరిగింది. తాజాగా సైమా అవార్డ్స్ వేడుకలకు హాజరయ్యింది మంచు లక్ష్మి. రెడ్ కార్పెట్‌పై తను యాంకర్‌తో మాట్లాడుతున్న సమయంలో కెమెరాకు ఒక వ్యక్తి అడ్డంగా వచ్చాడు. ముందుగా ఒక వ్యక్తి కెమెరా ముందుకు అడ్డంగా రాగానే తనను తరిమికొట్టే ప్రయత్నం చేసింది. అయినా అతడు వినకుండా మళ్లీ కెమెరా ముందే నడిచే ప్రయత్నం చేశాడు. అప్పుడు మంచు లక్ష్మి.. ‘హలో డుర్ర్. కెమెరా వెనక నడవండి. బేసిక్’ అంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో మంచు లక్ష్మి యాసలో చెప్పిన ఆ మాటలు సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.

ఆర్టిస్ట్‌ను మాత్రమే కాదు..
‘నా మాస్టర్‌పీస్‌లో మామూలుగా షికారుకు వస్తే ఇలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి నేను కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. ఫ్రేమ్ థ్రోవర్ కూడా. హింస అనేది ఎప్పుడూ పరిష్కారం కాదు కానీ..’ అనే క్యాప్షన్‌తో తన వైరల్ వీడియోను తనే షేర్ చేసింది. దీనికి నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అయ్యారు. డుర్ర్ అని మంచు లక్ష్మి చేసిన సౌండ్ హైలెట్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. పైగా డుర్ర్ అని లక్ష్మి హ్యాష్‌ట్యాగ్ కూడా క్రియేట్ చేసింది. గో బిహైండ్ ది కెమెరా డ్యూడ్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా క్రియేట్ చేసింది. దీంతో కొన్నాళ్ల పాటు పలు మీమ్స్‌కు ఈ వీడియోలు ఉపయోగించడం తప్పనిసరి అని మీమర్స్ అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

చివరిగా ‘మాన్‌స్టర్’..
ఇక సినిమాల విషయానికొస్తే.. గత కొంతకాలంగా మంచు లక్ష్మి నటనలో అంత యాక్టివ్‌గా లేరు. తాజాగా మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘మాన్‌స్టర్’ అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది లక్ష్మి. ఈ మూవీలో మంచు లక్ష్మి చేసిన పాత్రకు ప్రేక్షకులు ఫుల్ షాక్ అయిపోయారు. ఎంచుకున్న డిఫరెంట్ పాత్రకు పూర్తిస్థాయిలో తన నటనతో న్యాయం చేసిందని మంచు లక్ష్మికి మలయాళం ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే పడ్డాయి. ఇక తను నిర్మాతగా తన తండ్రితో ఒక సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకుంది లక్ష్మి. కానీ ఇప్పుడు మోహన్ బాబు.. కన్నప్ప ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వదని వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read: వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Latest News: ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
Maganti Sunitha Casts Vote: కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
Advertisement

వీడియోలు

Amit Shah on Delhi Car Blast | ఢిల్లీ కారు బ్లాస్ట్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్షన్ | ABP Desam
Delhi Car Blast Amit Shah PM Modi | ఢిల్లీ బ్లాస్ట్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశం | ABP Desam
Pillars of Creation Explained in Telugu | పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ కరిగిపోతున్నాయ్ | ABP Desam
IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Latest News: ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
ఢిల్లీలో పేలుడు ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సీక్రెట్‌గా విచారణ
Maganti Sunitha Casts Vote: కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కుమారుడు, కుమార్తెలతో కలిసి వెళ్లి ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
ఢిల్లీ పేలుడుకు పుల్వామాతో లింక్‌! కారు కొన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన తారిఖ్‌!
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికారులు
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే
బిగ్‌బాస్ డే 64 రివ్యూ... నామినేషన్లలో బుర్రబద్దలయ్యే షాక్... ఆ ఒక్కడు తప్ప అందరికీ డేంజరే
AP High Alert: ఢిల్లీలో పేలుడుతో ఏపీలో హై అలర్ట్.. ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం.. ప్రజలకు కీలక సూచనలు
ఢిల్లీలో పేలుడుతో ఏపీలో హై అలర్ట్.. ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం.. ప్రజలకు కీలక సూచనలు
Operation Sindoor 2.0: ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ట్రెండింగ్‌లో ఆపరేషన్ సింధూర్ 2.0
Hyderabad is on high alert: ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ -  ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్‌లో హై అలర్ట్ - ప్రజలకు కీలక సూచనలు చేసిన పోలీసులు
Embed widget