అన్వేషించండి

Salim Kumar: విషమంగా నేషనల్ అవార్డు విన్నర్ ఆరోగ్య పరిస్థితి... ఆస్పత్రిలో సలీం కుమార్

Salim Kumar Hospitalized: జాతీయ పురస్కార గ్రహీత, మలయాళ నటుడు సలీం కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా శనివారం ఉదయం అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను కొచ్చీలోని ఆస్పత్రిలో చేర్పించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు సలీం కుమార్ ఆరోగ్యం విషమించడంతో కొచ్చిలో చేరారు.
  • ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స పొందుతూ కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
  • మిమిక్రీ నుంచి జాతీయ అవార్డు విజేతగా ఎదిగిన సలీం కుమార్.

మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సలీం కుమార (Salim Kumar)ను శనివారం ఉదయం ఆస్పత్రిలో చేర్పించారు. అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కొచ్చిలోని ఒక ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 57 ఏళ్లు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే...

వెంటిలేటర్ మీద సలీం కుమార్...
విషమంగా మలయాళ నటుడి పరిస్థితి
ప్రస్తుతం సలీం కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇప్పుడు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి, వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. శనివారం ఉదయం సలీం కుమార్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. 

కాలేయ సంబంధిత సమస్యలతో కొన్ని సంవత్సరాలుగా సలీం కుమార్ సతమతం అవుతున్నారు. ఆయన లివర్ సిరోసిస్ బారిన పడ్డారు. గతంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ కూడా జరిగింది. ఆ విషయాన్ని సందర్భాల్లో ఆయన స్వయంగా చెప్పారు. ఆరోగ్య సమస్యల కారణంగా గత కొన్నేళ్లుగా సినిమాలు చేయడం కూడా తగ్గించారు. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.

Also Read: Buchi Babu Sana On Objectifying Janhvi Kapoor Role - సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్

సలీం కుమార్ కెరీర్ విషయానికి వస్తే... మిమిక్రీ కళాకారుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత నటుడిగా మలయాళ చిత్రసీమలో అడుగు పెట్టి అగ్ర నటుడిగా ఎదిగారు. 'ఇష్టమాను నూరు వట్టం' (1997)తో ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. 'కళ్యాణరామన్', 'పంజాబీ హౌస్', 'సిఐడి మూసా', 'ఈ పరక్కుమ్ తలిక' వంటి బ్లాక్‌ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆయన వినోదానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కామెడీ రోల్స్ చేసిన కొన్నాళ్ళకు సీరియస్ క్యారెక్టర్లలో కనిపించి ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'ఆదామింటే మకాన్ అబు' (2010)లో ఆయన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అలాగే, 'అచనురంగాత వీడు'కు గాను కేరళ స్టేట్ అవార్డు కూడా వరించింది.

Also ReadJr NTR Cookies News - అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్

సినిమాల్లోకి సలీం వారసుడు చందు
Salim Kumar Son Chandu: సలీం కుమార్ తనయుడు చందు సలీం కుమార్ కూడా తండ్రి బాటలో నడుస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 'మాలిక్', 'మంజుమ్మెల్ బాయ్స్'లో నటించారు.

సలీం కుమార్ సినిమాల్లో నటించడమే కాదు... రాజకీయ ప్రచార కార్యక్రమాల్లోనూ తన గళాన్ని వినిపించారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు మద్దతుగా ప్రచారం చేశారు. గతేడాది 'ఆజాదీ', 'భా భా బా' చిత్రాల్లో కనిపించారు.

Also ReadVaranasi Rama vs Kumbhakarna War - రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Frequently Asked Questions

సలీం కుమార్ ఎందుకు ఆసుపత్రిలో చేరారు మరియు ఆయన పరిస్థితి ఎలా ఉంది?

సలీం కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో, కొచ్చిలోని ఆసుపత్రిలో ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు.

సలీం కుమార్ ఆరోగ్య సమస్యకు ప్రధాన కారణం ఏమిటి?

సలీం కుమార్ చాలా సంవత్సరాలుగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు లివర్ సిరోసిస్ ఉంది మరియు గతంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స కూడా జరిగింది.

నటుడిగా సలీం కుమార్ సాధించిన ముఖ్యమైన అవార్డులు ఏమిటి?

'ఆదామింటే మకాన్ అబు' (2010) చిత్రానికి గాను ఆయన జాతీయ అవార్డు గెలుచుకున్నారు. అలాగే, 'అచనురంగాత వీడు' సినిమాకు కేరళ స్టేట్ అవార్డు కూడా అందుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget