'వారణాసి' చిత్రంలో శ్రీరాముడు, కుంభకర్ణుడు మధ్య జరిగే యుద్ధం హైలైట్‌గా నిలుస్తుందని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ యుద్ధం సుమారు అరగంట పాటు సాగుతుంది.
Varanasi: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Rama Vs Kumbhakarna: 'వారణాసి'లో కొన్ని సన్నివేశాల్లో శ్రీరాముడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించనున్న సంగతి తెలిసిందే.శ్రీరాముడిగా ఆయన చేసే ఓ యుద్ధం గురించి రివీల్ చేశారు విజయేంద్రప్రసాద్.

- రాజమౌళి 'వారణాసి'లో శ్రీరాముడు-కుంభకర్ణుడి యుద్ధం ప్రధానాకర్షణ.
- రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు రామపాత్ర వివరాలు వెల్లడించారు.
- మహేష్ రాముడిగా, పృథ్వీరాజ్ కుంభకర్ణుడిగా అరగంట యుద్ధం చేయనున్నారు.
- సినిమా చిత్రీకరణ ఆగస్టుకు పూర్తి, ఏప్రిల్ 7న విడుదల.
Vijayendra Prasad On Rama Vs Kumbhakarna War In Varanasi Movie: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా 'వారణాసి'. పురాణ ఇతిహాసాలతో పాటు ఈ తరం ప్రస్తావన సైతం కథలో ఉంటుంది. ఇందులో శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించనున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మేజర్ ట్విస్ట్ రివీల్ చేశారు. రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... ఇద్దరి మధ్య యుద్ధం గురించి చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే...
కుంభకర్ణుడితో శ్రీరాముడి యుద్ధం
రాజమౌళి విడుదల చేసిన 'వారణాసి' గ్లింప్స్ గమనిస్తే... హనుమంతుని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో పౌరాణిక నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు హనుమంతుని నేపథ్యంలో వచ్చే ఓ యుద్ధం గురించి విజయేంద్రప్రసాద్ ఓ మాట చెప్పారు.
'శ్రీ రామాంజనేయ యుద్ధం' అని ఎన్టీఆర్ ఓ సినిమా చేశారు. 'వారణాసి' గ్లింప్స్ చూశాక... అటువంటి సన్నివేశం ఏమైనా రాజమౌళి తీస్తున్నారా? అని కొందరికి సందేహం వచ్చింది. కట్ చేస్తే... హనుమంతుని తోక మీద రథంలో వెళుతున్నది రాముడు కాదని, శ్రీ రాముడు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
'వారణాసి'కి కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో మహేష్ - రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా గురించి... ''శ్రీ రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం ఉంది. అది సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు. అంతకు మించి మరిన్ని వివరాలు చెప్పలేదు.
#Varanasi movie is about ~ Lord RAMA v/s KUMBHAKARANA Epic War On the BIG SCREEN 😳 🔥
— Manoz Kumar (@ManozTalks) June 5, 2026
~ SURPRISE Revealed by #VijayendraPrasad #MaheshBabu as RAMA - ? #Prithviraj as KUMBHAKARANA - ?#PriyankaChopra as RAVANA sister ( Shurpanakha) - ? pic.twitter.com/KCNLtC5JuR
'వారణాసి'లో శ్రీరాముడిగా కనిపిస్తానని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. కుంభకర్ణుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య రాముడు వర్సెస్ కుంభకరుడి యుద్ధం ఉంటుంది. సుమారు అరగంట పాటు సాగే ఆ యుద్ధం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా మేకింగ్ విషయంలో రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ ఏడాది ఆగస్టుకు సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ కాగా... ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Photo Gallery: Dhootha Season 2 Launch Photos - నాగార్జున క్లాప్‌తో మొదలైన 'దూత 2' వెబ్ సిరీస్... ప్రియ, పార్వతి & టీంతో నాగచైతన్య ఫోటోలు
Frequently Asked Questions
'వారణాసి' సినిమాలో ముఖ్యమైన యుద్ధం ఏది?
'వారణాసి' చిత్రంలో శ్రీరాముడు, కుంభకర్ణుడు పాత్రలు ఎవరు పోషిస్తున్నారు?
సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నారు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఆగస్టుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత, ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
'వారణాసి' సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోయిన్ ఎవరు?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















