NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
NTR Cookies News: ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టారు. కుకీస్ కుక్ చేశానన పేర్కొన్నారు. అయితే ఓ అభిమాని తనకు పంపించమని అడిగారు. నిజంగా అతనికి కుకీస్ సెండ్ చేశారు.

నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) అటు ఆడియన్స్, ఇటు అభిమానులు... అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఆయన శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టారు. తాను కుకీస్ కుక్ చేశానని. ఆ స్టోరీని 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన కొందరు అభిమానులు ఆయనకు ప్రశ్నల వర్షం సందించారు. ఓ అభిమాని అయితే మా ఇంటికి పంపించమని కోరారు. నిజంగా అతనికి కుకీస్ సెండ్ చేశారు ఎన్టీఆర్.
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు
శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ (NTR Jr) సందడి మొదలు అయ్యింది. తన ఇన్స్టాగ్రామ్‌లో కుకీస్ (Cookies) బేక్ చేస్తున్న వీడియో ఆయన పోస్ట్ చేయడమే ఈ సందడి కారణం. ఆ వీడియో 'ఎక్స్'లో పోస్ట్ చేసిన ఓ అభిమాని... ''మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీస్ పంపు అన్నా'' అని ట్వీట్ చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ 'అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు' అని రిప్లై ఇచ్చారు.
— Jr NTR (@tarak9999) June 5, 2026
'అడ్రస్ పెట్టు' అని ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే... అందరూ సరదాగా అనుకున్నారు. కానీ, నిజంగా అతనికి కుకీస్ పంపారు ఎన్టీఆర్. దాంతో ఆ అభిమాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కుకీస్ పంపించడం పెద్ద విషయం ఏమీ కాదని కొంత మందికి అనిపించవచ్చు. కుకీస్ ఏమంత రేటు అనుకోవచ్చు. ఓ అభిమానికి హీరో పంపించడం స్పెషలే కదా!
What a day this is , may god has witnessed my love towards you @tarak9999 anna and made this, very special and emotional day in my life thank you so much anna waiting for cookies 😉😉
— saiteja (@saitejaathoti) June 5, 2026
The date i will remember and celebrate every year 05.06.2026#tigercookiesday… pic.twitter.com/kg4PoOov1v
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభమైన తొలి రోజుల్లో అభిమానులకు నేరుగా అందుబాటులో ఉండటానికి ఉపయోగించారు. ఫ్యాన్స్, నెటిజన్స్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యేవారు. అయితే తర్వాత తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కానీ కొన్ని రోజులకు స్టార్ హీరోలు ఎవరూ అందుబాటులో ఉన్న దాఖలాలు తక్కువ. ఎందుకంటే... నెగెటివిటీకి దూరంగా ఉండటం కోసం కారణంగా సోషల్ మీడియాకు దూరం అయ్యారు. సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్'లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది జూలైలో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు






















