Malavika Mohanan: నన్ను పెళ్లి చేసుకుంటారా? - ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన 'ది రాజా సాబ్' హీరోయిన్
The Raja Saab: 'ది రాజా సాబ్' మూవీ హీరోయిన్ మాళవిక మోహన్ తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. సినిమా విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Malavika Mohanan Funny Reply To Netizen: హీరోయిన్ మాళవికా మోహన్.. 'ది రాజా సాబ్'తో త్వరలోనే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా నెట్టింట ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. అందరినీ పలకరించి వారి క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ చెప్పారు.
నన్ను పెళ్లి చేసుకుంటారా?.. ఫన్నీ రిప్లై..
ఈ క్రమంలోనే 'నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా?' అంటూ ఓ నెటిజన్ మాళవికను ప్రశ్నించగా.. ఆమె ఫన్నీ రిప్లై ఇచ్చారు. 'నాకు దెయ్యాలంటే భయం.' అంటూ ఆన్సర్ ఇచ్చారు. సదరు అభిమాని 'ఎక్స్' ఖాతా పేరు 'ఘోస్ట్' అని ఉండడంతో ఆమె ఇలా రిప్లై ఇచ్చారు. ఇదే సమయంలో 'ది రాజా సాబ్' సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
మూవీలో ప్రభాస్‌తో మాస్ సాంగ్ చేసినట్లు చెప్పారు. ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మరిచిపోలేని మూమెంట్ అని అన్నారు. మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటానని వెల్లడించారు. 'ప్రస్తుతం 'ది రాజా సాబ్', తమిళంలో 'సర్దార్ 2', మలయాళంలో 'హృదయపూర్వం' మూవీస్ చేస్తున్నా. మోహన్ లాల్‌ను చూస్తూ పెరిగిన నేను ఆయనతో 'హృదయపూర్వం'లో కలిసి నటించడం ఆనందంగా ఉంది. దర్శక ధీరుడు రాజమౌళితో వర్క్ చేయాలని ఉంది. రజినీకాంత్ 'పేట' మూవీ నా కెరీర్‌లోనే చాలా స్పెషల్.' అని అన్నారు.
Also Read: సమంతతో రాజ్ రిలేషన్ షిప్ రూమర్స్ - ఆయన సతీమణి లేటెస్ట్ పోస్ట్ వైరల్.. ఏం చెప్పారంటే?
ముగ్గురు హీరోయిన్స్
'ది రాజా సాబ్' మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డార్లింగ్ రేంజ్.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్లుగా ముగ్గురు హీరోయిన్లను పెట్టినట్లు ఇటీవల టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్‌ను టీజర్‌లో చూపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
చనిపోయిన తర్వాత కూడా ఓ వృద్ధుని ఆత్మ మహల్‌లో ఉన్న సంపద కోసం ఆరాటపడుతుంది. ఆ నిధి కోసం భవనంలోకి వెళ్లిన హీరోయిన్లు, ప్రభాస్ ఎదుర్కొన్న పరిణామాలను స్టోరీగా చూపించనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. లవ్, కామెడీ, హారర్ జానర్‌లో రొమాంటిక్ హారర్ కామెడీగా ఈ మూవీ రూపొందుతోంది. టీజర్ భారీ హైప్ క్రియేట్ చేయగా.. కొత్త లుక్‌లో ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎమోషనల్ స్టోరీ
'ది రాజా సాబ్' ఒక ఎమోషనల్ స్టోరీ అని.. ఇండియన్ స్క్రీన్స్‌పై ఇప్పటివరకూ ఇలాంటి స్టోరీ రాలేదని డైరెక్టర్ మారుతి తాజాగా చెప్పారు. 'ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఫిల్మ్‌గా మూవీ రూపొందుతోంది. తాతయ్య, నానమ్మ, మనవడి స్టోరీ ఉంటుంది. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని భారీ సెట్స్ వేశాం. వీఎఫ్ఎక్స్ వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించాం.' అని చెప్పారు.
ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















