Mass Jathara Songs: 'మాస్ జాతర'లో మూడో పాట... 'హుడియో హుడియో' వచ్చేసిందండోయ్!
మాస్ మహారాజా రవితేజ, సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న 'మాస్ జాతర' సినిమాలో మూడో పాట 'హుడియో హుడియో...' వచ్చేసింది. వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా ఉన్న పాటను చూడండి.

Mass Jathara Release Date: అక్టోబర్ 31న 'మాస్ జాతర'తో థియేటర్లలోకి మాస్ మహారాజా రవితేజ వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ సినిమా నుంచి రెండు పాటలు 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ రిలీజ్ చేశారు.
హుడియో హుడియో...
వింటేజ్ రవితేజ వచ్చాడయ్యో!
'మాస్ జాతర'లో రవితేజకు జంటగా సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ నటించిన 'ధమాకా'కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఇప్పుడీ 'మాస్ జాతర'కు సైతం ఆయన మ్యూజిక్ డైరెక్టర్.
వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా 'మాస్ జాతర' సినిమా చేసినట్టు దర్శకుడు భాను భోగవరపు తెలిపారు. సాంగ్స్ సైతం ఆ కోవలో ఉన్నాయి. 'తూ మేరా లవ్వర్'లో చక్రి వాయిస్ వినిపించడం ద్వారా 'ఇడియట్'ను గుర్తు చేశారు. ఇప్పుడు మరో పాట 'హుడియో హుడియో'లో మెలోడీ వినిపించారు. దేవ్ రాసిన ఈ పాటలో సాహిత్యం అందరికీ అర్థం అయ్యేలా ఉంది. చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో కలిసి మరో సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహెబ్ ఈ పాటను పాడటం విశేషం.
Also Read: పవన్ సినిమాలో విలన్ రోల్... రిజక్ట్ చేసిన పాపులర్ పొలిటీషియన్!
Your new favourite melody to vibe with is here! 💖#HudiyoHudiyo Full Song Lyric Video is out now! 🎵
— Sithara Entertainments (@SitharaEnts) October 8, 2025
– https://t.co/lPOpNU4DXY
A Bheems Ceciroleo Musical 🎹
Sung by @HeshamAWmusic & #BheemsCeciroleo 🤩
✍️ #Dev #MassJathara #MassJatharaOnOct31st
Mass Maharaaj… pic.twitter.com/XU77aXHRcn
'హుడియో హుడియో' లిరికల్ వీడియో చూస్తే... మంచి మెలోడీతో మునుపటి మాస్ మహారాజా రవితేజను తీసుకు వస్తున్నట్టుగా... మాస్ - క్లాస్ మూమెంట్స్ చాలా కనిపించాయి. రవితేజ - శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ పాటకు ప్లస్ అయ్యింది.
'మాస్ జాతర'ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, మాటలు: నందు సవిరిగాన, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల.





















