(Source: Poll of Polls)
Samantha Raj Nidimoru: సమంతతో రాజ్ రిలేషన్ షిప్ రూమర్స్ - ఆయన సతీమణి లేటెస్ట్ పోస్ట్ వైరల్.. ఏం చెప్పారంటే?
Shhyamali: సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్ షిప్ వార్తలు హల్చల్ చేస్తున్న వేళ ఆయన సతీమణి శ్యామాలి తాజాగా ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై నెట్టింట చర్చ సాగుతోంది.

Shhyamali Cryptic Note On Trust: ఇటీవల సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ షిప్ రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. కొద్ది రోజుల క్రితం అబుదాబి వెకేషన్ ట్రిప్ ఫోటోస్ సమంత షేర్ చేయగా.. ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆమె డైరెక్టర్ రాజ్‌తోనే వెకేషన్‌కు వెళ్లారని చాలామంది కామెంట్స్ చేశారు. ఈ టాపిక్ మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.
రాజ్ సతీమణి పోస్ట్ వైరల్
రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ షిప్‌లో ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తోన్న వేళ.. తాజాగా ఆయన భార్య 'శ్యామాలి' నమ్మకంపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. గతంలోనూ ఆమె ఇన్ స్టా వేదికగా ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు 'నమ్మకం అన్నింటి కంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి పొందలేరు.' అంటూ తన ఇన్ స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. అయితే, ఇది వైరల్ అవుతుండగా.. వారిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
Also Read: 'పెద్ది'లో పవర్ ఫుల్ 'రామ్ బుజ్జి' - మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ లుక్ అదుర్స్
అసలెక్కడ మొదలైందంటే?
'శుభం' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటోస్ షేర్ చేయగా వైరల్‌గా మారాయి. రాజ్ భుజంపై ఆమె తల వాలి ఉన్న ఫోటోతో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ వార్తలు మళ్లీ హల్చల్ చేశాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే.. సమంత మేనేజర్ అవన్నీ రూమర్లంటూ ఖండించారు. తప్పుడు ప్రచారం చెయ్యొద్దన్నారు.
ఈ క్రమంలో అప్పట్లో డైరెక్టర్ రాజ్ భార్య శ్యామాలి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తన కోసం ఆలోచించే వారందరికీ దేవుడి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఫస్ట్ పోస్ట్ చేయగా.. అంతా వారిని ఉద్దేశించే అని అనుకున్నారు. ఆ తర్వాత ఇటీవలే కర్మ సిద్ధాంతం గురించి కూడా పోస్ట్ చేశారు. 'కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది.' అంటూ కొటేషన్ రాసుకొచ్చారు శ్యామాలి. దీనికి 2023లో రాజ్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. అయితే, వీటిపై ఎక్కడా ఆమె స్పందించలేదు.
ఇక సమంత, రాజ్ నిడిమోరు 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' కోసం కలిసి వర్క్ చేశారు. ఆ టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారనే రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరగడం దానికి మరింత బలం చేకూర్చింది. ఇటీవల అబుదాబి ట్రిప్‌లోనూ సామ్.. రాజ్‌తో కలిసి వెళ్లారనే చర్చ సాగింది. వీటన్నింటి నేపథ్యంలో శ్యామాలి తాజా పోస్ట్ వైరల్ అవుతోంది.





















