అన్వేషించండి

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Ashika Ranganath: నాగార్జున అప్‌కమింగ్ మూవీ ‘నా సామిరంగ’ నుండి క్రేజీ అప్డేట్‌ను అందించారు మేకర్స్. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఎవరో రివీల్ చేశారు.

Nagarjuna - Ashika Ranganath: సంక్రాంతి విడుదల కానున్న సినిమాలు కూడా డిసెంబర్‌లో ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ముందుగా గ్లింప్స్, ఆ తర్వాత పాటలు విడుదల చేసి సినిమాలపై హైప్ పెంచాలని మూవీ టీమ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఆ లిస్ట్‌లో సీనియర్ హీరో నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ కూడా యాడ్ అయ్యింది. ఇప్పటివరకు ఈ మూవీలో నాగార్జున లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేస్తూ మొదటి అప్డేట్ వచ్చింది. దాని తర్వాత ‘నా సామిరంగ’ నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చేసింది మూవీ టీమ్.

వరలక్ష్మిగా అషికా రంగనాథ్..
‘నా సామిరంగ’లో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకు మూవీ టీమ్ అనౌన్స్ చేయలేదు. అయితే నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో మొదటి తన హీరోయిన్ ఎవరో చెప్తూ.. అక్కడే గ్లింప్స్‌ను కూడా లాంచ్ చేశారు. ఆ సందర్భంగా హీరోయిన్ అషికా రంగనాథ్ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ గ్లింప్స్‌లో ‘మా వరలక్ష్మిని మీకు పరిచయం చేస్తున్నాం’ అని చెప్తూ అషికాను చూపించారు. అంటే ‘నా సామిరంగ’లో అషికా పాత్ర పేరు వరలక్ష్మి అని అర్థమవుతోంది. అచ్చమైన తెలుగమ్మాయిలాగా గ్లింప్స్‌తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అషికా. హీరోయిన్ ఇంట్రోతో పాటు ఈ గ్లింప్స్‌లో ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా జతచేసింది మూవీ టీమ్.

ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే..
నాగార్జున, అషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ‘నా సామిరంగ’కు ఆస్కార్ అవార్డ్ గ్రహిత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే’ పాటను త్వరలోనే విడుదల చేస్తామని మూవీ టీమ్ అప్డేట్ ఇచ్చింది. ‘నా సామిరంగ’ అనేది కేవలం ఒక కమర్షియల్ చిత్రం మాత్రమే కాకుండా ఇందులో ఒక క్లాసిక్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని నాగార్జున ఇప్పటికే రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి దీనిని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్.. ‘నా సామిరంగ’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ.. ఈ మూవీకి కథ, డైలాగులు అందించారు.

‘అమీగోస్’ చిత్రంతో డెబ్యూ..
‘నా సామిరంగ’లో నాగార్జున, అషికాతో పాటు నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశకు చేరిందని నాగ్ తెలిపారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన అషికా.. ఇప్పటికే తెలుగులో తన డెబ్యూ ఇచ్చింది. 2023 మొదట్లో కళ్యాణ్ రామ్ హీరోగా విడుదలయిన ‘అమీగోస్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని అందించకపోయినా.. అందులో అషికా యాక్టింగ్, గ్లామర్.. చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తను కళ్యాణ్ రామ్‌తో కలిసి చేసిన ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ..’ డ్యూయెట్.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో తన రెండో సినిమాతోనే నాగార్జునలాంటి సీనియర్ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కొట్టేసింది అషికా. దీంతో ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో మరికొన్ని ఆఫర్లు వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Also Read: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలతNagababau on Pithapuram | గీతకు కాల్ చేసిన కడప వ్యక్తి..వార్నింగ్ ఇచ్చిన నాగబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
IPL 2024: గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget