Bobby Deol: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్
Animal Movie: ‘యానిమల్’ చిత్రం అనేది సీనియర్ నటుడు బాబీ డియోల్ జీవితాన్ని కొత్త మలుపు తిప్పినట్టుగా అనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకు అందుతున్న అభిమానం చూసి బాబీ ఎమోషనల్ అయ్యారు.
Bobby Deol : ఒక్కొక్కసారి సినిమాల్లో హీరో పాత్రకు ఎంత క్రేజ్ లభిస్తుందో.. విలన్ పాత్రకు కూడా అంతే క్రేజ్ లభిస్తుంది. కొన్నిసార్లు అయితే హీరోకంటే విలనే బాగా నటించాడు అనే ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘యానిమల్’ గురించి కూడా అలాంటి రివ్యూలే వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో సీనియర్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. హిందీలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో చిత్రాలు చేశారు బాబీ.. కానీ ఆయనను మరోసారి మంచి నటుడిగా నిలబెట్టిన చిత్రం ‘యానిమల్’ అని ప్రేక్షకులు తనను ప్రశంసల్లో ముంచేస్తున్నారు. దీంతో అందరి ముందు ఒక్కసారి ఎమోషనల్ అయ్యారు బాబీ డియోల్.
కలలాగా అనిపిస్తోంది..
తాజాగా ముంబాయ్‌లోని ఒక పబ్లిక్ ప్లేస్‌లో బాబీ డియోల్ కనిపించడంతో అక్కడి ఫోటోగ్రాఫర్లు ఆయన చుట్టూ చేరారు. అంతే కాకుండా ‘యానిమల్’ సినిమాలో ఆయన నటన గురించి, పాత్ర గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయనను ప్రశంసలతో ముంచేశారు. అవన్నీ విన్న బాబీ.. ‘‘చాలా థ్యాంక్స్. దేవుడు నా మీద చాలా దయతో ఉన్నాడు. ఈ సినిమాకు ఇంత ప్రేమ లభిస్తుండడంతో చూసి కలకంటున్నానేమో అనిపిస్తోంది’’ అని చెప్తూ ఎమోషనల్ అయిపోయారు. దీంతో ఆయన స్టాఫ్.. ఆయనను ఓదార్చారు. కారులో ఎక్కిన తర్వాత కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటూ కంటతడి పెట్టుకున్న బాబీ డియోల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డియోల్ కుటుంబానికి కలిసొచ్చింది..
సన్నీ డియోల్, బాబీ డియోల్.. బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిన పాపులర్ అన్నదమ్ములు. అయితే వీరిద్దరికీ ఈ ఏడాది చాలా కలిసొచ్చిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముందుగా ధర్మేంద్ర సినిమా విడుదలయ్యింది. ఆ తర్వాత సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘గదర్ 2’ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. తమ కుటుంబంలోనే కరణ్ పెళ్లి జరిగింది. సన్నీ డియోల్ చిన్న కుమారుడు హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు బాబీ డియోల్ కూడా విలన్‌గా సూపర్‌హిట్‌ను అందుకున్నాడు. చూస్తుంటే ఈ ఏడాది కుటుంబం మొత్తానికి సంతోషాన్నిచ్చింది అంటూ నెటిజన్ రాసుకొచ్చారు.
డైలాగులు లేకపోయినా..
ఇక ‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ ఎంటర్ అయినప్పటి నుండి చివరి వరకు ఆయన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడని మరొక నెటిజన్ రివ్యూ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన ఇంట్రడక్షన్ సీన్ గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. మామూలుగా విలన్ అంటే కండలతో బలంగా ఉండాలి అని అనుకుంటారు ప్రేక్షకులు. అదే విధంగా స్టైలిష్ విలన్‌గా బాబీ సరిగ్గా సెట్ అయ్యాడు. కానీ ఆయన మాటలతో బయపెట్టే విలన్ కాదు.. తన విలనిజం అంతా యాక్షన్‌లోనే చూపించాడు. ఈ అంశం ప్రేక్షకులను సైతం తెగ ఇంప్రెస్ చేసింది. ‘యానిమల్’ చిత్రం మొత్తంలో బాబీ డియోల్‌కు డైలాగ్ లేకపోయినా.. తన విలనిజం ఏంటో నటనతోనే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు. ట్రైలర్‌లోనే తన విలనిజం ఎలా ఉంటుందో శాంపుల్ చూపించిన దర్శకుడు.. సినిమాలో పూర్తిస్థాయిలో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. దీంతో బాబీ డియోల్ కొన్నాళ్ల వరకు బాలీవుడ్‌లో విలన్‌గా బిజీ అవ్వనున్నాడని అందరూ భావిస్తున్నారు.
Also Read: ‘యానిమల్’ చిత్రానికి త్రిష షాకింగ్ రివ్యూ - నెటిజన్స్ ట్రోల్ చేయడంతో..
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply