అన్వేషించండి

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మార్చి నుంచి ఆ త్యాగం చేయక తప్పదు!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. భారీ సినిమా కోసం వాళ్లు ఓ త్యాగం చేయక తప్పదు. అది ఏమిటో తెలుసుకోండి.

'గుంటూరు కారం' తనకు లాస్ట్ రీజనల్ ఫిల్మ్ అని ఆ సినిమా విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చాలా స్పష్టంగా చెప్పారు. ఇకపై తాను చేసే సినిమాలు పాన్ ఇండియా లెవల్ అని వివరించారు. తన తొలి పాన్ ఇండియా సినిమాను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అందులో సూపర్ స్టార్ కంప్లీట్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ లుక్ ప్రిపరేషన్ కోసం ఆయన మూడు నెలలు ఎవరికీ కనిపించకూడదని డిసైడ్ అయ్యారట. 

మార్చి నుంచి రాజమౌళి సినిమా లుక్ కోసం!
'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబును గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్తగా చూపించారు. కొంచెం పెరిగిన గడ్డం, లుంగీలో మాసీగా ఉన్నారు. ఇప్పుడు ఆ లుక్ కంటే పూర్తి భిన్నమైన లుక్ కోసం మహేష్ బాబు, రాజమౌళి ట్రై చేస్తున్నారట. గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కనుక అందుకు తగ్గట్టుగా లుక్ ఉంటుందట.

మహేష్ బాబు త్వరలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత మార్చి నుంచి పూర్తిగా పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ అప్పియరెన్స్ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూపర్ స్టార్ డిసైడ్ అయ్యారట. రాజమౌళి సినిమా కోసం ప్రజెంట్ అనుకుంటున్న లుక్ కోసం మినిమమ్ రెండు నుంచి మూడు నెలలు పడుతుందట. అన్ని రోజులు పబ్లిక్ లో మహేష్ బాబును చూడకుండా అభిమానులు ఉండక తప్పదు. వాళ్లు ఆ త్యాగం చేయాలి.

జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్!?
రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథలు రాస్తారు. ఇప్పుడీ మహేష్ బాబు సినిమాకు కూడా ఆయన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఈ సినిమా స్టోరీ ఐడియాస్, స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందట. జూన్ 2024 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మహారాజా చక్రవర్తి... సినిమా టైటిల్ ఏది?
మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు, అభిమానుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'మహారాజా', 'చక్రవర్తి' పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మహేష్ బాబు పేరులో మహా, రాజమౌళి పేరులో రాజా తీసుకుని 'మహారాజా' టైటిల్ ఖరారు చేసినట్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, చివరకు ఏ టైటిల్ ఉంటుందో చూడాలి.

Also Readఆస్కార్స్‌ అవార్డుల్లో 13 నామినేషన్స్... బాఫ్టాలో 7 అవార్డ్స్... హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో కథానాయికగా ఇండోనేషియా నటి చెల్సా ఎలిజబెత్ నటించనున్నారు. ఈ సినిమాను ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget