Vinesh Phogat: బాధపడకు ఛాంపియన్, మేమంతా నీ వెంటే! వినేశ్ ఫొగాట్‌కు సెలబ్రిటీల మద్దతు
Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధిస్తుందనుకున్నవినేశ్ అకస్మాత్తుగా ఆటకు దూరమవ్వటంతో యావత్ భారతం షాక్‌కు గురైంది. ఈ నేపధ్యంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఆమెకు తమ మద్దతు తెలిపారు.
Olympics 2024: భారతీయులంతా రెప్పవేయకుండా ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వంద గ్రాముల అధిక బరువు, వంద కోట్ల మంది భారతీయుల ఆశలను చిదిమేసింది. రెజ్లింగ్ లో ఫైనల్ కి చేరుకున్నాం, తొలి అడుగు తోనే చరిత్ర లిఖించబోతున్నాం అంటూ చేసుకున్న సంబరాలు పూర్తి కాకుండానే పిడుగులాంటి వార్త వినపడింది. భారత అభిమానుల హృదయం ముక్కలైంది. అయితేనేం పతకం కోసం, దేశం కోసం వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) పడిన శ్రమకు దేశ ప్రజలు అవాక్కయ్యారు. ఒలింపిక్స్ లో బరిలో నిలబడి గెలవటం కోసం ఆమె చేసిన త్యాగాలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. నువ్వు ఇప్పటికే ఛాంపియన్ అంటూ తమ మద్దతు చెబుతున్నారు. భారత క్రీడాభిమానులతో పాటు భారతప్రధాని సహా పలువురు నేతలు, సినీ, క్రీడా ప్రముఖులు వినేశ్‌కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్, కరీనా కపూర్ లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో వినేష్ ఫోగట్‌కు మద్దతు తెలుపగా, బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా తన ఇంస్టాలో వినేష్ ఫోగట్‌కు సపోర్ట్ గా పోస్ట్ పెట్టారు.
View this post on Instagram
టాలీవుడ్ నటి సమంత సైతం ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
View this post on Instagram
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వినేష్ ఫోగట్‌కు మద్దతుగా నిలిచారు. ఫలితం కాదు, అందుకోసం నువ్వు పడిన తపన నిన్ను ఇప్పటికే ఛాంపియన్ ని చేసిందన్నారు.
Today’s outcome doesn't matter, but your greatness in how you coped with the decision does 👏👏👏#VineshPhogat, you’ve shown everyone that your heart is that of a true champion; your resilience and strength to stand tall in difficult times inspires us all.
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2024
Medal or not, your…
బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, అర్జున్ రాంపాల్ కూడా వినేష్ ఫోగట్‌కు తమ మద్దతు తెలిపారు.
No way. They disqualified Vinesh Phogat for being over weight by 150gms.? This can’t be real please tell me this isn’t real. Tell me this can change. There is hope. #VineshPhogat #wrestling #OlimpiadasParis2024 #Unfair #HeartBreaking
— arjun rampal (@rampalarjun) August 7, 2024
View this post on Instagram