Sitara Ghattamaneni Birthday : మహేష్ కుమార్తె గొప్ప మనసు - బర్త్‌డేకి నిరుపేద బాలికలకు సైకిళ్లను బహుమతి ఇచ్చిన సితార
మహేష్ బాబు కూతురు సితార ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా బుర్రిపాలెం లోని మహేష్ బాబు ఫౌండేషన్ కు చెందిన కొంతమంది అమ్మాయిలకు సైకిళ్ళను బహుమతిగా ఇచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రతల కూతురు సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni Birthday) పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సితార తన గొప్ప మనసును చాటుకుంది. సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కటింగ్, పార్టీలు అంటూ ఓ రేంజ్ లో హంగామా చేస్తారు. కానీ మహేష్ కూతురు సితార మాత్రం అందుకు పూర్తి భిన్నం. తండ్రి మహేష్ అడుగు జాడల్లోనే నడుస్తూ తన పుట్టినరోజును చాలా సింపుల్ గా జరుపుకుంది. బుర్రిపాలెంలోని మహేష్ బాబు ఫౌండేషన్ కు చెందిన కొంతమంది అమ్మాయిలతో సితార తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. బుర్రిపాలెంలోని మహేష్ బాబు ఫౌండేషన్ అమ్మాయిలతో కలిసి కేక్ కట్ చేసి ప్రేమతో వాళ్ళందరికీ కేక్ తినిపించింది. అనంతరం వాళ్లతో సరదాగా ముచ్చటించింది.
అంతేకాకుండా తన బర్త్ డే సెలబ్రేషన్స్ అనంతరం ఆ బాలికలు అందరికి సైకిళ్ళను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. "ఇప్పుడు ఆ బాలికలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ వాళ్ళందరికీ కేవలం సైకిల్ దూరంలో మాత్రమే ఉంటుంది. నీలో ఇతరులపై అమితమైన ప్రేమను చూపించే ఎంతో గొప్ప మనసు ఉంది. నీ అద్భుతమైన జీవితంలో ఇలాంటి అర్థవంతమైన మధుర జ్ఞాపకాలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే సితార" అంటూ తన కూతురికి విషెస్ చెప్పారు నమ్రత. ప్రస్తుతం పుట్టినరోజు సందర్భంగా పింక్ కలర్ సైకిల్స్ లను సితార బహుమతిగా అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహేష్ అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు సితార గొప్ప మనసును ప్రశంసిస్తూ తను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నారు. కాగా అటు మహేష్ బాబు కూడా తన కూతురికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందజేశారు. "11వ బడిలోకి అడుగుపెట్టిన నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే నా స్టార్. నువ్వు దేన్నైనా సాధించగలవు" అంటూ సితారకు మహేష్ విషెస్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల సితార PMJ అనే ప్రముఖ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి ఒక కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది. ఇక ఈ యాడ్ ని సితార బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
ఈ యాడ్లో సితార తన యాక్టింగ్ తో క్యూట్ లుక్స్ అండ్ స్మైల్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం సితార జువెలరీ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ జువెలరీ యాడ్ కోసం సితార భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ యాడ్ కోసం సితార ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెమ్యూనరేషన్ మొత్తాన్ని చారిటీకి ఇచ్చినట్లు సితార ఇటీవల మీడియా సమావేశంలో చెప్పడం విశేషం.
Also Read : భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న హీరోయిన్లు వీళ్ళే - టాప్ ప్లేస్‌లో ప్రభాస్ సినిమా హీరోయిన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram
View this post on Instagram