భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న హీరోయిన్లు వీళ్ళే - టాప్ ప్లేస్‌లో ప్రభాస్ సినిమా హీరోయిన్
Prabhas Project K Heroine సినీ ఇండస్ట్రీలో ఇండియా వైడ్ గా ఉన్న స్టార్ సెలబ్రిటీస్ లో ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లించే హీరోయిన్స్ లో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచింది.
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీల ఆదాయాలు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు పెరుగుతూ ఉంటాయి. వాళ్లు చేసే సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్లు కావచ్చు, ఇతర వ్యాపారాల్లో ఆర్జించే ఆదాయం కావచ్చు, ఇతర రంగంలో పెట్టుబడి ద్వారా వచ్చే లాభాల వల్ల ప్రతి సంవత్సరం సెలబ్రిటీ ఆదాయం భారీగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయం పెరుగుతున్నా కూడా కొంతమంది సెలబ్రిటీలు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగ్గొడుతూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు స్టార్ సెలబ్రిటీస్ ఇంట్లో ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతకీ మన ఇండియాలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ లో ఎవరు ఎక్కువగా పన్నులు కడుతున్నారు అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఇండస్ట్రీలో అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్స్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
ఇంతకీ ప్రభుత్వానికి అత్యధికంగా పన్ను చెల్లించే హీరోయిన్ మరెవరో కాదు మన బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకోన్. సుమారు రూ.500 కోట్ల నికర విలువ ఉన్న దీపికా పదుకోన్ ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్ అందరిలో టాప్ టాక్స్ పేయర్ గా నిలిచింది. టాలీవుడ్ సెలబ్రిటీల కంటే బాలీవుడ్ వాళ్లే సినిమాలు ఇతర వ్యాపారాలు అంటూ ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటారు. ఇందులో హీరోయిన్లే దేశంలోని అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో ఉంటున్నారు. అందులో దీపికా పదుకోన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 2016 -17 సంవత్సరంలో దీపిక ఏకంగా రూ.10 కోట్ల పన్ను చెల్లించారట. తదుపరి సంవత్సరాల్లో కూడా ఈ రేంజ్ లోనే పన్ను చెల్లిస్తున్నట్లు పలు బాలీవుడ్ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అంతేకాదు గత ఏడాది అత్యధిక పన్ను చెల్లించే జాబితాలో చేరిన ఏకైక హీరోయిన్ గా దీపికా పదుకోన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీపిక నికర ఆదాయ విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని తెలుస్తుండగా... ఆమె వార్షిక ఆదాయం సుమారు రూ. 40 కోట్లు. ఒక్కో సినిమాకు దీపిక రూ. 15 నుండి రూ. 20 కోట్లు తీసుకుంటుంది. ఇక దీంతో పాటు ఎండార్స్మెంట్ల కోసం రూ. 8 నుంచి రూ. 10 కోట్లు వసూలు చేస్తోంది. ఇక దీపికా పదుకోన్ తర్వాత స్థానంలో మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఉంది. ఇండియా వైడ్ గా ఉన్న సెలబ్రిటీస్ లో అత్యధిక టాక్స్ పే చేస్తున్నా సెకండ్ హీరోయిన్ గా ఆలియా భట్ గెలిచింది. ఈమె సంవత్సరానికి సుమారు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు టాక్స్ పే చేస్తుందట.
కాగా 2013-14 సంవత్సరంలో కత్రినా కైఫ్ అత్యధిక పన్ను చెల్లించే హీరోయిన్గా మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఆస్థానాన్ని దీపికా పదుకోన్ భర్తీ చేసింది. 2013-14 సంవత్సరంలో కత్రినా కైఫ్ ప్రభుత్వానికి టాక్స్ రూపంలో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ దీపికా పదుకోన్ మాత్రం రూ. 10 కోట్లు చెల్లిస్తూ హైయెస్ట్ టాక్స్ పెయర్ హీరోయిన్గా నిలిచింది. అంతేకాదు భారతీయ మహిళా సెలబ్రిటీస్ లో అత్యంత ధనవంతులైన హీరోయిన్స్ లో దీపికకి రెండవ స్థానం దక్కడం విశేషం. ఇక హీరోల విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రూ. 25 కోట్ల వరకు టాక్స్ కడుతున్నారు.
Also Read : 'గుంటూరు కారం' సినిమాకి మహేష్ రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్ - అన్ని కోట్లా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial