అన్వేషించండి

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravi Teja's Ravanasura Movie Trailer Review : మాస్ మహారాజ రవితేజ రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రావణాసుర'. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా యువ దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కించిన సినిమా 'రావణాసుర' (Ravanasura Movie). ఇప్పటి వరకు రవితేజ మాస్ క్యారెక్టర్ చేయడం మీరు చూసి ఉంటారు. క్లాస్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూసి ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... నెగిటివ్ షెడ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో 'రావణాసుర'లో చూడబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల అయ్యింది. అది ఎలా ఉందంటే?

ట్రైలర్ ఎలా ఉందంటే?

'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్' - 'రావణాసుర' సినిమా, అందులో రవితేజ క్యారెక్టర్ గురించి చెప్పడానికి మలయాళ నటుడు జయరామ్ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ చాలు. 'వాడు చాలా డేంజర్ గాని లెక్క ఉన్నాడు తమ్మి' - మరో నటుడు రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇది. 'మర్డర్ చేయడం క్రైమ్. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. అయామ్ ఎన్ ఆర్టిస్ట్. నా ఆర్ట్ ను రెస్పెక్ట్ చెయ్ బేబీ' అని రవితేజ ఓ డైలాగ్ చెప్పారు. సినిమా కథ అంతా మర్డర్ చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతోంది. 

డైలాగులకు తగ్గట్టు రవితేజను చాలా పవర్ ఫుల్ పాత్రలో సుధీర్ వర్మ ప్రజెంట్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్ గ్లింప్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచారు. అంతే కాదు... సినిమాలో మంచి కామెడీ కూడా ఉందని స్టార్టింగ్ సీన్స్ చూస్తే ఈజీగా అర్థం అవుతోంది.
 
'లోపలి వచ్చేటప్పుడు డోర్ కొట్టాలని తెలియదా?' అని ఫరియా అబ్దుల్లా అడిగితే... 'సరసాలు ఆడుకునేటప్పుడు డోర్ వేసుకోవాలని తెలియదా?' అని రవితేజ ఎదురు ప్రశ్న వేశారు. ఆ సన్నివేశంలో శ్రీరామ్, ఫరియా సోఫాలో ఉన్నారు. ఫరియా దగ్గర పని చేసే జూనియర్ లాయర్ క్యారెక్టర్ రవితేజ చేసినట్టు ఉన్నారు. ఆయనతో ఉండే పాత్రలో 'హైపర్' ఆది కనిపించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్... సినిమాలో అన్నీ ఉన్నాయని అర్థం అవుతోంది. 

 

Also Read ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?

ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు...
రవితేజ 'ధమాకా'కు సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియోతో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ 'రావణాసుర' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ నాలుగు పాటలు విడుదల చేశారు. అందులో మూడు పాటలకు హర్షవర్ధన్ బాణీలు అందించగా... ఓ పాటను భీమ్స్ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

లాయర్ రోల్ చేసిన రవితేజ!
'రావణాసుర' సినిమాకు వస్తే... అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఏయన్నార్ మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. 'విక్రమార్కుడు', 'పవర్' సినిమాల్లో రవితేజ పోలీస్ రోల్ చేశారు. అయితే, ఆయన లాయర్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్! 

ఐదుగురు హీరోయిన్లు!
'రావణాసుర' సినిమాలో హీరోయిన్లు ఎంత మంది ఉన్నారో తెలుసా? మొత్తం ఐదు మంది! అవును... ఇందులో అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఎవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది? ఎవరు మెయిన్ రోల్ చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

Also Read  ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget