(Source: ECI/ABP News/ABP Majha)
Actress Ivana: దళపతి విజయ్ మూవీలో ఆఫర్ - నో చెప్పిన యంగ్ హీరోయిన్, కారణం ఇదేనట?
Ivana: హీరోయిన్ ఇవానా స్టార్ హీరో విజయ్ సినిమాకు నో చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఏకంగా స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేయడంతో ఈ బ్యూటీ ప్రస్తుతం హాట్‌టాపిక్ అయ్యింది.
Actress Ivana Say No to Vijay Movie: నటి ఇవానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'లవ్ టూడే' సినిమాతో ఒక్కసారిగా ఈ బ్యూటీ లైమ్‌లైట్లోకి వచ్చింది. అతి చిన్న వయసులోని ఇండస్ట్రీకి వచ్చిన ఆమె లవ్ టూడే తెచ్చిపెట్టిన క్రేజ్‌తో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కానీ ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించింది. అప్‌కమ్మింగ్ నటీనటులకు మంచి గుర్తింపు రావాలంటే ఒక్క స్టార్ హీరో సినిమాలో వారి ఖాతాలో పడాల్సిందే. లేదంటే వారికి ఫేం రావడం కష్టం. అందుకే కుర్ర హీరోయిన్లు సైతం ఎలాంటి లెక్కలు వేసుకొకుండా అగ్ర హీరో సినిమాలకు ఒకే చెబుతారు.
పాత్ర ఏంటీ, హీరో వయసేంత అనే తేడాలు చూసుకోకుండా ఆఫర్ వస్తే చాలనుకుంటున్నారు. కానీ ఇవానా మాత్రం ఆ లెక్కలు చూసి ఏకంగా దళపతి విజయ్ సినిమానే రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానికి కారణం కూడా ఉందట. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు పొందుతున్న ఆమె హీరోకు చెల్లిగా నటిస్తే కెరీర్‌కు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భయపడిందట. అందుకే నిర్మోహమాటం లేకుండ దళపతి విజయ్ సినిమాను రిజెక్ట్ చేసినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ ప్రస్తుతం 'ద గోట్'(The Goat) మూవీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Also Read: సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన 'బిగ్‌బాస్' వాసంతి - ఆమె భర్త కూడా నటుడే, ఎవరో తెలుసా?
ట్రైం ట్రావెల్ నేపథ్యంలో పాన్ ఇండియా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. తండ్రికి జరిగిన అన్యాయాన్ని ట్రైం ట్రావెల్ చేసి హీరో ఎలా పగ తీర్చుకుంటాడనేది ఈ కథ అని తెలుస్తోంది. ఇందులో ప్రభుదేవా, అజ్మల్, ప్రశాంత్ తదితరుల కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసమే మూవీ టీం ఇవానాను సంప్రదించారట. ఇందులో విజయ్‌కి చెల్లి పాత్ర కోసం ఆమె అడగ్గా.. వెంటనే నో చెప్పిందట. దానికి కారణం ఏంటో రీసెంట్‌గ్ ఓ తమిళ్ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించింది. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయని, అప్పుడే చెల్లి పాత్రలు చేస్తే తనకు హీరోయిన్ ఛాన్నులు తగ్గే అవకాశముందని, అందుకే నో చెప్పానంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇవానా నో చెప్పడంతో ఇవానా స్థానంలో నటి-మోడల్ అభియుక్తిన తీసుకున్నారట. అయితే, 'లవ్ టూడే' సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది ఇవానా. యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. లవర్స్ మొబైల్ మార్చుకుంటే ఎలా ఉంటుందనే సరికొత్త కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం యువతని ఉర్రూతలూగించింది. రొమాంటిక్ కామెడీ అంశాలతో మోడ్రన్ లవ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.