అన్వేషించండి

Rajinikanth - Lokesh Kanagaraj Movie : రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమాలో విలన్‌గా మలయాళ హీరో?

Thalaivar 172 Movie Updates : రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ ఓ భారీ సినిమా చేయనున్నారు. అందులో విలన్ పాత్ర కోసం మలయాళ హీరోతో చర్చలు జరుపుతున్నారట!

Prithviraj Sukumaran In Rajinikanth Lokesh Kanagaraj Movie : మన తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్  అభిమానులు ఎలా అయితే ఉన్నారో... ఈ తరం ప్రేక్షకులలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు కూడా అలాగే అభిమానులు ఉన్నారు. రీసెంట్ విజయ్ సినిమా 'లియో'కి వస్తున్న కలెక్షన్స్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సందీప్ కిషన్ 'నగరం' (తమిళంలో 'మా నగరం), కార్తీ 'ఖైదీ', లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాల ఎఫెక్ట్ అది. 

'లియో' తర్వాత రజనీకాంత్ సినిమాయే! 
'లియో' తర్వాత రజనీతో సినిమా లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. 'లియో' థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'మానగరం' కంటే ముందు సినిమా కథ రాశానని, ఇప్పుడు ఆ కథకు తుది మెరుగులు దిద్దుతానని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో విలన్ పాత్రకు మలయాళ హీరోతో చర్చలు జరుపుతున్నారని కోలీవుడ్ గాసిప్. అది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే... దాని సారాంశం ఏమిటంటే?

రజనీ సినిమాలో పృథ్వీరాజ్?
పృథ్వీరాజ్ సుకుమారన్ గుర్తు ఉన్నారు కదా! ప్రభాస్ 'సలార్'లో కీలక పాత్రలో నటించారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో రీమేక్ అయ్యాయి. మరొకొన్ని డబ్ అయ్యాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్ర కోసం డిస్కషన్స్ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇదీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో సినిమాయే. హీరోలతో పాటు విలన్ క్యారెక్టర్లను సైతం సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి.

Also Read 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?    

రజనీకాంత్ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్ చేయాలని భావిస్తున్నట్లు లోకేష్ కనగరాజ్ తెలిపారు. క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకులు, కొన్ని హాలీవుడ్ సినిమాలను ఐమ్యాక్స్ కెమెరాలలో తీస్తారు. బహుశా... సౌత్ ఇండియాలో ఐమ్యాక్స్ కెమెరాతో తీస్తున్న తొలి సినిమా రజనిది కావచ్చు. 

Also Read టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?

తెలుగు దర్శకులతో సినిమాలు ఉంటాయా?
రజనీకాంత్ హీరోగా తెలుగు దర్శకులు సైతం సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర), 'వీర సింహా రెడ్డి' దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్లు బలంగా వినిపించాయి. అయితే.. బాలకృష్ణతో బాబీ, రవితేజతో గోపీచంద్ మలినేని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'జై భీం' ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజాతో రజనీ సినిమా చేస్తున్నారు. దాని కంటే ముందు పెద్దమ్మాయి ఐశ్వర్య దర్శకత్వంలో ప్రత్యేక పాత్ర చేసిన 'లాల్ సలామ్' విడుదల కానుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget