అన్వేషించండి

క్రేజ్ తగ్గినా బిజినెస్​లో తగ్గలే - 'లియో' ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వందల కోట్లా?

దలపతి విజయ్ 'లియో' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి రూ.454 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.

కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'లియో'(Leo) పై ఏ రేంజ్​లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కించడమే. 'ఖైదీ' మూవీతో సినిమాటిక్ యూనివర్స్​ని క్రియేట్ చేసిన ఈ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఇటీవల 'వితక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే సౌత్ లో భారీ హైప్ నెలకొంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అందుకే లోకేష్ కనగరాజ్ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఇప్పటికే తమిళనాట వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ప్లాన్ చేసామని హింట్స్ ఇస్తూ అంచనాలను తారస్థాయికి తీసుకెళ్తున్నాడు. అయితే తమిళంలో ఓ రేంజ్ లో హైప్ ఉన్న ఈ చిత్రానికి తెలుగు, మలయాళంలో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. అందుకు కారణం ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడమే అంటున్నారు. దానికి తోడు 'జైలర్', 'విక్రమ్' స్థాయిలో మ్యూజిక్ లేదనే మాట కూడా వినిపిస్తోంది.

నిజానికి అనిరుద్ మ్యూజిక్ అంటే ఆ మూవీ ఆల్బమ్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం. కానీ 'లియో' సాంగ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. దానికి తోడు 'లియో' ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే మూవీకి ఫ్రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఈ కారణాలన్నింటి వల్ల ఆడియన్స్ లో 'లియో'పై అంచనాలు తగ్గిపోతున్నాయి. కానీ బిజినెస్ వర్గాలు మాత్రం ఇవేవీ పట్టించుకోనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే 'లియో' మూవీకి భారీగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

'లియో' థియేట్రికల్ బిజినెస్ వివరాలు చూస్తే..

తమిళనాడు - రూ.100 కోట్లు

ఆంధ్రప్రదేశ్ - రూ. 14 కోట్లు

తెలంగాణ - రూ. 7 కోట్లు

కర్ణాటక - రూ. 13 కోట్లు

కేరళ - రూ.16 కోట్లు
 
రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.8 కోట్లు

ఓవర్సీస్ - రూ.60 కోట్లు

వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 218 కోట్లు

'లియో' నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు చూస్తే..

మ్యూజిక్ రైట్స్ - రూ.16కోట్లు

సాటిలైట్ - రూ.80 కోట్లు

డిజిటల్ - రూ.140 కోట్లు

మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.236 కోట్లు

కాగా 'లియో' చిత్రానికి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి మొత్తం రూ.454 కోట్ల బిజినెస్ జరిగింది. తలపతి విజయ్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక 'లియో' విషయానికొస్తే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియ ఆనంద్, మలయాళ నటుడు మ్యాథ్యూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళాని సామి నిర్మించారు. అక్టోబర్ 19 దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Collections: 'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
Chennai Love Story Collections: ఆదివారం అదరగొట్టిన చెన్నై లవ్ స్టోరీ... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
ఆదివారం అదరగొట్టిన చెన్నై లవ్ స్టోరీ... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Embed widget