అన్వేషించండి

Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత

SingerS  Janaki Is No More: సంగీత ప్రపంచం మూగబోయింది. ప్రముఖ గాయని, దక్షిణాది గానకోకిలగా పేరు పొందిన ఎస్ జానకి ఇకలేరు. ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వృద్ధాప్య సమస్యలతో మైసూరు ఆసుపత్రిలో గాయని జానకి తుదిశ్వాస విడిచారు.
  • 1957లో సినీ రంగ ప్రవేశం చేసి, 48వేలకు పైగా పాటలు పాడారు.
  • నాలుగు జాతీయ, 33 రాష్ట్ర అవార్డులు పొంది, 2016లో రిటైరయ్యారు.

Singer S Janaki Death Cause: దక్షిణాది గానకోకిల (Nightingale of South India)గా పేరు గాంచిన ప్రముఖ గాయని ఎస్‌. జానకి. ఆమె గొంతు మూగబోయింది. ఈలోకం నుంచి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది.

మైసూరులో జానకి కన్నుమూత
ఎస్ జానకి వయసు 88 ఏళ్ళు. ఈ రోజు (శనివారం, జూలై 11న) మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో జానకి మరణించినట్లు ఆమె మనవరాలు అప్సర తెలిపారు.

ఎస్ జానకి మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ సువర్ణ అధ్యాయానికి ముగింపు పడిందని చెప్పవచ్చు. ఏప్రిల్ 23, 1938న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో ఎస్ జానకి జన్మించారు. ఆమె తండ్రి శిష్టా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యునిగా, అలాగే ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. 

జానకి బాల్యం సిరిసిల్లలో గడిచింది. తొమ్మిదేళ్ల వయసులో మొదటిసారి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అందరి ముందు సింగింగ్‌లో తన ప్రతిభ చాటారు. ఆ తర్వాత నాదస్వర విద్వాంసులు పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక పాఠాలు అభ్యసించారు. అయితే... శాస్త్రీయ సంగీతంలో ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు.

జానకి మొదటి సినిమా ఏదో తెలుసా?
S Janaki Singing Debut: తమిళ సినిమా 'విధియిన్ విలయాత్తు' (1957)తో 19 ఏళ్ల వయసులో నేపథ్య గాయనిగా జానకి ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ నుంచి ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. సుమారు ఆరు దశాబ్దాల పాటు సాగిన ఎన్నో అద్భుతమైన పాటలను శ్రోతలకు అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో సుమారు 48 వేలకు పైగా పాటలను ఆలపించారు.

Also Read: K Bhagyaraj Passed Away - తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి కాంబినేషన్ పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. వాళ్లిద్దరూ కలిసి వేలాది పాటలు ఆలపించారు. అవన్నీ అజరామరంగా నిలిచాయి. సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తర్వాత 2016లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇకపై పాటలు పాడానని చెప్పారు. అయితే... 2018లో తమిళ సినిమా 'పన్నాడి'లో తన చివరి పాటను పాడారు.

Also Read: Salim Kumar Passed Away - మాలీవుడ్‌లో విషాదం... గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి

జానకికి వచ్చిన అవార్డులు ఎన్నో తెలుసా?
జానకి గాత్రంలో మాధుర్యానికి నాలుగుసార్లు జాతీయ పురస్కారం లభించింది. ఇక రాష్ట్ర పురస్కారాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి 33 అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా... జానకి తీసుకోవడానికి నిరాకరించారు. సంగీత, చిత్రసీమకు తాను చేసిన సేవలకు అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న' రావాలని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే... 959లో వి. రామ్ ప్రసాద్‌తో జానకి వివాహం జరిగింది. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు.

Also Read: Kumod Raney - స్నేహితురాలి మరణంతో సల్మాన్ కంటతడి... ఎవరీ కుముద్ రాణే?

Frequently Asked Questions

ఎస్. జానకి మరణానికి కారణం ఏమిటి?

వృద్ధాప్యం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఎస్. జానకి మరణించినట్లు ఆమె మనవరాలు అప్సర తెలిపారు.

ఎస్. జానకి ఎక్కడ కన్నుమూశారు?

ఎస్. జానకి మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఎస్. జానకి తన కెరీర్‌లో ఎన్ని పాటలు ఆలపించారు?

ఎస్. జానకి ఆరు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడారు.

ఎస్. జానకికి వచ్చిన అవార్డులు ఏమిటి?

ఆమెకు నాలుగు జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల నుండి 33 అవార్డులు లభించాయి. 2013లో పద్మభూషణ్ పురస్కారాన్ని నిరాకరించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget