News
News
X

Legend Saravanan New Look: ‘లెజెండ్’ శరవణన్ న్యూ లుక్‌పై ట్రోల్స్ - త్వరలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్?

‘ది లెజెండ్’ మూవీతో వెండితెరకు పరిచయమైన ‘లెజెండ్’ శరవణన్ త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారు. శాంపిల్‌గా ఆయన తన కొత్త లుక్ ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలారు. మీరూ ఓ లుక్కేయండి మరి.

FOLLOW US: 
Share:

‘లెజెండ్’ శరవణన్.. ఈ పేరు వినగానే తప్పకుండా ఫ్యాన్సుకు పూనకాలు వస్తాయ్. ఆయన నటించిన ‘ది లెజెండ్’ మూవీ హిట్ కొట్టకపోయినా.. ట్రోలర్స్‌కు మాత్రం ఉపాధి కల్పించింది. అయితే, శరవణన్ పరాజయాన్ని అంత ఈజీగా అంగీకరించరు. మొదటి సినిమాలో జరిగిన తప్పిదాలను తెలుసుకుని మరో కొత్త సినిమాకు సిద్ధమైపోతున్నారు. ఈ సారి సినీ ప్రేక్షకులను ఏ మాత్రం నిరుత్సాహానికి గురిచేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే, ఆయన పూర్తిగా తన లుక్‌ను మార్చేసుకున్నారు. సోమవారం అదిరిపోయే లుక్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకున్నారు. 

అయితే, ‘ది లెజెండ్’ సినిమాలో ఉన్న లుక్‌కు, ప్రస్తుతం ఉన్న లుక్‌కు ఏ మాత్రం పొంతన లేదు. పైగా గతంలో కంటే స్టైలిష్‌గా కనిపిస్తున్నారు శరవణన్. ఆయన లుక్ చూసి జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మంచి లుక్ కోసం ఆయన ముఖానికి సర్జరీ చేసుకున్నారా? అనే సందేహాలు కూడా వెల్లడవుతున్నాయి. లెజెండ్ సార్.. నిజంగా ఇది మీరేనా? అని పలువురు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. కొందరైతే.. ఆయన ఆరెంజ్ కలర్ సూట్ చూసి.. ‘అలా వైకుంఠపురంలో’ మూవీలో అల్లు అర్జున్ లుక్‌తో పోల్చుతున్నారు. శవరణన్ అల్లు అర్జున్‌ను కాపీ కొడుతున్నారని అంటున్నారు. 

అప్పటికీ ఇప్పటికీ ఇదే తేడా: శరవణన్ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే.. కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ వేరేగా ఉండేది. ఈ సారి దాన్ని లైట్‌గా తగ్గించారు. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కనిపించే ఆయన ఇప్పుడు.. లైటుగా మీసాలు, గెడ్డాలు పెంచారు. దానివల్ల ఆయనలో మ్యాన్లీ లుక్ కనిపిస్తోంది. అలాగే డ్రెస్సింగ్ స్టైల్‌ కూడా మార్చడంతో ఇప్పుడు కాస్త బెటర్ లుక్‌తో కనిపిస్తున్నారు శరవణన్. అయితే, ట్రోలర్స్ మాత్రం ఆయనపై మీమ్స్ చేయడం మానలేదు. ఆ ఫొటోలు పోస్టు చేసిన అకౌంట్లోనే ఆయన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

చివరిగా తెలుసుకోవల్సిన విషయం ఏమిటంటే.. లెజెండ్ శరవణన్ త్వరలోనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగానే ఆయన ఈ లుక్స్ ప్రయత్నించారు. త్వరలోనే తాను డిటైల్స్ చెబుతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన కొత్త లుక్ పిక్స్ ఇంకా చూడలేదా? అయితే, ఈ కింది ట్వీట్లో చూసేయండి. 

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ది లెజెండ్’

'లెజెండ్' శరవణన్ అరుల్ 2022 మధ్యలో విడుదలైన ‘ది లెజెండ్’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ మూవీని దర్శక ద్వయం జెడి-జెర్రీ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తమిళంలో ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్‌లో టాప్-1 స్థానంలో ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, గీతికతో శరవణన్‌ను జంటగా నటించారు. నాసర్, ప్రభు, విజయకుమార్‌, యోగి బాబు, వివేక్ ఇతర పాత్రల్లో నటించారు ది న్యూ లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. 

లెజెండ్ శరవణన్‌పై ట్రోల్స్

Published at : 13 Mar 2023 05:58 PM (IST) Tags: Legend Saravanan Legend Saravanan new look Legend Saravanan New movie Legend Saravanan transformation

సంబంధిత కథనాలు

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి