Legend Saravanan: లెజెండ్ శరవణన్ మేకోవర్ చూస్తే మెంటలే... ఈసారి ఏం ప్లాన్ చేశావ్ అన్నా!
Legend Saravanan New Movie: శరవణా స్టోర్స్ అధినేత, 'ది లెజెండ్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టిన 'లెజెండ్' శరవణన్ అలియాస్ అరుల్ శరవణన్ కొత్త సినిమా పూజతో మొదలైంది.
Director Durai Senthilkumar and Legend Saravanan's movie started with pooja ceremony: లెజెండ్ శరవణన్... ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. నిజం చెప్పాలంటే... ఆయన అసలు పేరు అరుల్ శరవణన్ (Arul Saravanan). తమిళ ప్రజల్లో, తమిళనాడులో పేరు పొందిన శరవణా స్టోర్స్ అధినేత. 'ది లెజెండ్' సినిమాతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఊర్వశి రౌతేలా ఓ కథానాయికగా నటించిన ఆ సినిమా తెలుగులోనూ విడుదల అయ్యింది. అందులో హీరోయిన్లుగా నటించిన వాళ్ళ కంటే సినిమా వేడుకకు అతిథులుగా ఎక్కువ మంది రావడం డిస్కషన్ పాయింట్ అయ్యింది.
రెండో సినిమా స్టార్ట్ చేసిన 'లెజెండ్' శరవణన్!
Legend Saravanan second movie started: 'ది లెజెండ్' విజయం సాధించలేదు. కానీ, అరుల్ శరవణన్ మాత్రం పాపులర్ అయ్యారు. ఆయన లుక్స్ మీద ట్రోల్స్ వచ్చాయి. విమర్శలు పక్కన పెట్టి... శరవణన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. పూజతో ఈ సినిమా మొదలు అయ్యింది. 'న్యూ గేమ్ స్టార్టడ్' అని ఆయన కొత్త సినిమా లుక్స్ ట్వీట్ చేశారు.
కొత్త సినిమా ప్రారంభం కంటే దీని కోసం 'లెజెండ్' శరవణన్ మేకోవర్ కావడం, ఆ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శరవణన్ లుక్ చూశాక... 'ఈసారి ఏం ప్లాన్ చేశావ్ అన్నా' అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
#LegendsNext #NewGameStarted@Dir_dsk@onlynikil pic.twitter.com/nIvJxNDUkl
— Legend Saravanan (@yoursthelegend) June 24, 2024
శివ కార్తికేయన్, ధనుష్ టు లెజెండ్ శరవణన్!
'లెజెండ్' శరవణన్ కొత్త సినిమాకు దురై సెంథిల్ కుమార్ (Durai Senthilkumar) దర్శకుడు కావడం తమిళ ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. శివ కార్తికేయన్ హీరోగా ఆయన రెండు సినిమాలు తీశారు. ఇప్పుడు శరవణన్ దగ్గరకు ఎందుకు వచ్చారో మరి!
ధనుష్ డ్యూయల్ రోల్ చేయడంతో పాటు త్రిష నెగిటివ్ రోల్ చేసిన 'ధర్మ యోగి' (తమిళంలో 'కోడి') సినిమాకూ దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. ఆ తర్వాత ధనుష్ హీరోగా 'పటాస్' అని మరో సినిమా చేశారు. విజయ్ సేతుపతి 'విడుదలై' చిత్రానికి సెకండ్ యూనిట్ దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు సూరి ప్రధాన పాత్రలో నటించిన 'గార్డియన్'కు దర్శకత్వం వహించారు. తమిళంలో క్రేజీ స్టార్లతో సినిమాలు చేసిన దురై సెంథిల్ కుమార్... 'లెజెండ్' శరవణన్ సినిమా చేయడం ఆశ్చర్యమే.
#LegendsNext @yoursthelegend #NewGameStarted with @Dir_dsk@onlynikil pic.twitter.com/WyWAGCmE9P
— Ramesh Bala (@rameshlaus) June 24, 2024