అన్వేషించండి

Leelammo song: ‘లీలమ్మో.. శ్రీలీలమ్మో’.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ‘ఆదికేశవ’ జోడీ!

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘లీలమ్మో’ అనే పాట విడుదలైంది.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. లేటెస్టుగా ‘లీలమ్మో’ అనే సాంగ్ ను లాంచ్ చేసారు. 

‘ఆదికేశవ’ సినిమాకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’ పాటలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌ లో నిర్వహించిన ఈవెంట్ లో 'లీలమ్మో' అనే మూడో పాటను ఆవిష్కరించారు. మాస్ జనాలను దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన ఈ పాట, ఇన్స్టెంట్ గా టార్గెట్ ఆడియన్స్ ను రీచ్ అయిందనే చెప్పాలి. 

'లీలమ్మో.. లీలమ్మో.. లవ్లీగా చూస్తావా' అంటూ సాగే ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మాస్ డ్యాన్స్ లతో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రీలీలా మరోసారి తన ఎనర్జిటిక్ స్టెప్పులతో రెచ్చి పోయింది. మొదటి మూడు సినిమాల్లో డ్యాన్స్ కోసం పెద్దగా కష్టపడని వైష్ణవ్.. ఈ సాంగ్ లో మాత్రం శ్రీలీలకు పోటీ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేసాడు. కలర్ ఫుల్ సెట్, సెటప్​కు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ లో ఇద్దరూ ఆకట్టుకున్నారు. 

'లీలమ్మో' పాటకు జీవీ ప్రకాశ్‌ మాసీ ట్యూన్​ని కంపోజ్ చేయగా.. దీనికి లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌ లిరిక్స్ అందించారు. సింగర్స్ నకాష్‌ అజిజ్‌, ఇంద్రావతి చౌహాన్‌ కలిసి ఎంతో హుషారుగా ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయగా.. డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేసారు. 

‘లీలమ్మో’ పాట విడుదల సందర్భంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. ఇది తనకెంతో ఇష్టమైన పాట అని చెప్పింది. తన పేరుతో ఉన్న తొలి పాట ఇదని, అందుకే తనకు మరింత ప్రత్యేకమైన గీతంగా నిలిచిపోతుందని అంది. ఇది అసలైన మాస్‌ పాట.. వినగానే నాగిని డ్యాన్స్‌ చేయాలనిపించింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చాలా బాగుంది. వైష్ణవ్‌ తేజ్ అద్భుతంగా డ్యాన్స్‌ చేశాడు అని శ్రీలీల తెలిపింది. షూటింగ్‌ అంతా సరదాగా సాగిపోతుందని, సినిమా కూడా సరదా సరదాగా ఉంటుందని వైష్ణవ్‌ అన్నారు. 

జానికి ‘ఆదికేశవ’ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. బాక్సాఫీస్ వద్ద క్లాష్ ని నివారించడానికి పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. 2023 నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్ ఆకట్టుకోగా, త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. 

Also Read: మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్‌ సుమ.. ఎందుకంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget