Lavanya Tripathi: నిహారికకు ఆడపడచు కట్నం ఏమిచ్చారు? లావణ్య రియాక్షన్
Lavanya Tripathi: తన ఆడపడుచు నిహారికపై మెగా కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిహా కోసం ఏదైనా చేస్తానని, తనకు అవసరమైనప్పుడు ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది.
Lavanya Tripathi About Niharika Dowry: మెగా కోడలు.. అనే బిరుదు అనంతరం లావణ్య త్రిపాఠి క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఎక్కడ కనిపించిన మెగా కోడలు అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గతేడాది పెళ్లిపీటలు ఎక్కింది ఈ బ్యూటీ. అయితే వీరిద్దరి డేటింగ్ రూమర్స్ గురించి తరచూ వార్తలు వినిపించినా ఎక్కడ కూడా వరుణ్-లావణ్యలు బయటపడలేదు. ప్రేమించుకున్న మాట నిజమైన డేటింగ్ వార్తలను పట్టించుకోకుండా మీడియా, ఫ్యాన్స్ నుంచి తప్పించుకుంటు వచ్చారు.
మొత్తానికి ఆరేళ్లపాటు సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ గతేడాది నవంబర్‌లా మూడుముళ్‌ల బంధంతో ఒక్కటయ్యారు.ఇక పెళ్లి అనంతరం లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. మెగా కోడలు అయ్యాక లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌తో బిజీ అయిన ఈ మెగా కోడలు తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఆడపడుచు నిహారికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్య్వూలో హోస్ట్ నుంచి ఆమెకు ఆడపడచు కట్నంపై ప్రశ్న ఎదురైంది.
Also Read: NBK109: అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మూవీ టీం - బాలయ్యకు విలన్‌గా 'యానిమల్' స్టార్
మీరు నిహారికతో చాలా క్లోజ్‌గా ఉంటారు కదా.. పెళ్లిలో ఆమెకు ఏమైనా ఆడపడుచు కట్నం ఇచ్చారా? అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. అలాంటిది ఏం ఇవ్వలేదని చెప్పింది. "నిహారికకు కట్నం, కానుకలు అంటూ ఏం ఇవ్వలేదు. డబ్బులు కూడా ఏం ఇవ్వలేదు. అసలు తను నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే తను ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నిహా కోసం ఏదైనా చేస్తా. తనకు అవసరమైనప్పుడు ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటా. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా బిజీగా ఉంది. ఏదైన మంచి కథ వస్తే నిహారిక బ్యానర్లో నటిస్తాను. మేం ఒకటే ఫ్యామిలీ కాబట్టి తన నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తాను"అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం లావణ్య కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లికి ముందు నుంచి నిహారిక-లావణ్యలు మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి జిమ్, వెకేషన్స్‌కు వెళ్లేవారు. మొదటి నుంచి వరుణ్-లావణ్య ప్రేమకు నిహారిక ఫుల్ సపోర్టు ఇచ్చింది. ఇదే విషయాన్ని రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలోనూ వెల్లడించింది మెగా డాటర్. వదినతో తనకు మంచి అనుబంధం ఉందని, తనతో చాలా సరదాగా ఉంటానని కూడా చెప్పింది. అన్ని విషయాల్లో వదిన తనకు సపోర్టుగా ఉంటుందని, సలహాలు.. సూచనలు ఇస్తుందంటూ నిహారిక చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు తరచూ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలు, ప్రేమను వ్యక్తి చేసుకుంటు ఉంటారు.
View this post on Instagram