అన్వేషించండి

Raja Saab : ప్రభాస్ 'రాజా సాబ్ ' రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ గ్యారెంటీ!

Raja Saab : ప్రభాస్ - మారుతి కలయికలో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Latest update on Prabhas, marututi Raja Saab release : పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న ఈ హీరో రీసెంట్ గా 'సలార్' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ 22న ఫ్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇక సలార్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం తదుపరి సినిమాలపై ఫోకస్ చేసాడు.

సలార్ తర్వాత ప్రభాస్ కల్కి, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ రెండు సినిమాల చిత్రీకరణ తుది దశలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ రెండు సినిమాలను ఒకే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'కల్కి' సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.  ఇక మారుతి తెరకెక్కిస్తున్న 'రాజా సాబ్' సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ తప్పితే మరో అప్డేట్ ఇవ్వలేదు. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ జరుపుతూ వచ్చిన ఈ సినిమా చిత్రీకరణ దాదాపు కూడా పూర్తికావచ్చింది. ఇలాంటి తరుణంలో 'రాజా సాబ్' రిలీజ్ డేట్ పై ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది.

అదేంటంటే, ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. డార్లింగ్ నుంచి గత ఏడాది ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ ఏడాది కల్కి, రాజా సాబ్ సినిమాలతో అభిమానులకి డబుల్ ట్రీట్ గ్యారెంటీ అని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అయితే మూవీ టీం నుంచి ఇంకా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని అభిమానులు తమ హీరోని ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో అదేవిధంగా ఈ సినిమాలో ప్రభాస్ ని ప్రజెంట్ చేయబోతున్నారు మారుతి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'బాహుబలి' నుంచి ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు మారుతికి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతుండటం విశేషం.

Also Read : అసభ్యకర పనులు ఏం చేశానో చెప్పు, నెటిజన్ వ్యాఖ్యలపై యాంకర్ రష్మి తీవ్ర ఆగ్రహం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
Embed widget