Laapataa Ladies Movie: సుప్రీం కోర్టులో ‘లాపతా లేడీస్‘ స్క్రీనింగ్ - సీజేఐతో పాటు ఇతర న్యాయమూర్తులు హాజరు
దేశ అత్యున్నత న్యాయస్థానం అరుదైన కార్యక్రమానికి వేదికైంది. కోర్టు ఆడిటోరియంలో బాలీవుడ్ మూవీ ‘లపతా లేడీస్’ మూవీని ప్రదర్శించారు. సీజేఐతో పాటు ఇతర న్యాయమూర్తులు ఈ సినిమాను చూశారు.
Laapata Ladies Screened In Sc: సుప్రీంకోర్టు. దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ న్యాయ నిలయం 75 వసంతాల వేడుక జరుపుకుంటోంది. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన సందర్భానికి వేదిక అయ్యింది. తొలిసారి సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఓ సినిమాను ప్రదర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను తిలకించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..
సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్’ మూవీ ప్రదర్శన
సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా న్యాయస్థానం ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్’ మూవీని ప్రదర్శించారు. లింగ సమానత్వం కథాశంతో ఈ సినిమాను కిరణ్ రావు తెరకెక్కించారు. న్యాయమూర్తులు, వారి కుటుంబాలు, రిజిస్ట్రీ స్టాఫ్ ఈరోజు సాయంత్రం మూవీ చూసినట్లు కోర్టు అడ్మినిస్ట్రేషన్ విభాగం వెల్లడించింది. 4:15 గంటల నుంచి 6:20 వరకు అడ్మినిస్ట్రేషన్ భవనంలోని సి బ్లాక్ ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ తో పాటు ఇతర న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ స్టాఫ్ చూశారు. ఈ ప్రదర్శనకు అమీర్ ఖాన్ తో పాటు కిరణ్ రావు హాజరయ్యారు.
#WATCH | Delhi: Visuals from Supreme Court as judges of the apex court, actor-producer Aamir Khan and director-producer-screenwriter Kiran Rao attend the screening of the film 'Laapataa Ladies'
— ANI (@ANI) August 9, 2024
The film is being screened here as part of a gender sensitisation programme. pic.twitter.com/mfPk2PgHw9
#WATCH | Director-producer-screenwriter Kiran Rao as she leaves from Court No.1 of the Supreme Court after hearing.
— ANI (@ANI) August 9, 2024
Her movie 'Laapataa Ladies' will be screened here as part of a gender sensitisation programme, shortly this evening. pic.twitter.com/StwOU6haE8
సినిమా కథ ఏంటంటే?
‘లాపతా లేడీస్’ సినిమా కథ ఏంటంటే.. కొత్తగా పెళ్లైన ఓ జంట ఇంటికి వస్తుండగా, మధ్యలో భార్య తప్పిపోతుంది. ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని, వేరే అతడి భార్యను తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య కాదని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. వెంటనే వెళ్లి తన భార్య తప్పిపోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాడు. ఆయన భార్య ఎలా తప్పిపోయింది? ఆమె స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు? కేసు తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమాలో చూపించారు. 2001లో ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది.
మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లాపతా లేడీస్’
‘లాపతా లేడీస్’ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించారు. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్ర పోషించారు. మార్చి 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని అందుకుంది.
Read Also: ‘లాపతా లేడీస్’ మూవీ రివ్యూ: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కామెడీ మూవీ ఎలా ఉంది?