By: ABP Desam | Updated at : 24 May 2022 09:08 AM (IST)
విజయ్ దేవరకొండ, సమంతకు ఎటువంటి గాయాలు కాలేదు
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda Injured?), స్టార్ హీరోయిన్ సమంత (Samantha Injured?) జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఇటీవల కశ్మీర్ షెడ్యూల్ ముగించుకున్న చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంది. కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేయడం వెనుక కారణం ఏమిటి? హీరో హీరోయిన్లు ఇద్దరికీ షూటింగులు గాయాలు అయ్యాయా? అందుకే, త్వరగా హైదరాబాద్ వచ్చేశారా? వంటి అనుమానాలు మొదలయ్యాయి. దీనికి పుకార్లే కారణం!
కశ్మీర్ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయ్యాయని... దాంతో దర్శకుడు శివ నిర్వాణ త్వరగా షెడ్యూల్ ముగించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై చిత్ర బృందం స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశారు.
''విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయినట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. విజయవంతంగా 30 రోజుల కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం అంతా హైదరాబాద్ చేరుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. దయచేసి ఎటువంటి పుకార్లను నమ్మవద్దు'' అని 'ఖుషి' సినిమా యూనిట్ పేర్కొంది.
Also Read: ఎఫ్ 3 థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారో తెలుసా?
Fake news pic.twitter.com/dbneXS8h5s
— Shiva Nirvana (@ShivaNirvana) May 24, 2022
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
Also Read: అనసూయ సూపర్ స్టైల్ - సూపర్ సింగర్ జూనియర్ కోసం
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా
Vijay Sethupathi: రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి - పాన్ ఇండియా లెవెల్లో!
Alia Bhatt On First Night: ఫస్ట్ నైట్ గురించి ఓపెన్ అయిన ఆలియా భట్
Upasana: మెగా ఫ్యామిలీకి వారసుడొస్తున్నాడా? ఉపాసన హింట్ ఇచ్చేసింది!
YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
Mega Sentiment: 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు
Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !
IND vs ENG 5th Test: బాజ్ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్ ద్రవిడ్