Kubera First Glimpse: అంతా సస్పెన్స్... క్యూరియాసిటీని పెంచిన ధనుష్ - నాగార్జునల 'కుబేర' గ్లింప్స్ - మూవీ స్టోరీ ఇదేనా?
Kubera Movie: తమిళ కథానాయకుడు ధనుష్, మన టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మికల మూవీ 'కుబేర' గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయ్యింది. అందులోని విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'కుబేర' (Kubera). రష్మిక మందన్న ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. మరి ఆ గ్లింప్స్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న 'కుబేర' మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ కాబోతున్న చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక అంత కంటే ముందే హీరోయిన్ రష్మికకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసి, సినిమాపై హైప్ పెంచారు. అందులో రష్మిక ఓ ప్రదేశంలో గునపంతో తవ్వగా, ఓ పెద్ద సూట్ కేసు దొరుకుతుంది. తీసి చూసే దాని నిండా డబ్బులు కనిపిస్తాయి. ఈ గ్లింప్స్ క్యూరియాసిటీని పెంచగా, కొత్త గ్లింప్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూశారు మూవీ లవర్స్. అది ఎట్టకేలకు వచ్చేసింది.
తాజాగా 'కుబేర' గ్లింప్స్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. "యాక్షన్, డ్రామా, సినిమాటోగ్రాఫీల మిశ్రమం... అల్ ది వెరీ బెస్ట్" అంటూ ఎక్స్ లో 'కుబేర' గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మహేష్ బాబు. అయితే గ్లిమ్స్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. ఇక టీజర్ లో నాగార్జున ధనవంతుడిగా కన్పించారు. అలాగే ధనుష్ బిచ్చగాడిలా సరికొత్త అవతార్ లో దర్శనం ఇచ్చారు. పైగా ఆయన వీధుల్లో పరిగెత్తే సీన్ క్యూరియాసిటీని పెంచింది. అలాగే రష్మికతో పాటు మరికొంత మంది నటుల పాత్రలను రివీల్ చేశారు. టీజర్ చివర్లో ధనుష్ ఊహించని విధంగా తెల్లని పట్టు పంచెలో దర్శనం ఇచ్చారు. ఈ ట్విస్ట్ అయితే బాగుంది కానీ అసలు స్టోరీ ఏంటి అన్న విషయం ఏమాత్రం అర్థం కాలేదు. ఇక డీఎస్పీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
A blend of action, drama, and cinematography!
— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2024
All the very best…🙂#KuberaGlimpse https://t.co/TwLo74arko @dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP@AsianSuniel #Puskurrammohan @SVCLLP @amigoscreation @KuberaTheMovie
మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే క్లారిటీ వచ్చేసింది. తాజాగా మరోసారి ఈ గ్లిమ్స్ తో ఆ విషయం స్పష్టం అయ్యింది. అయితే టీజర్ ను బట్టి చూస్తే ధనుష్ రిచ్ కిడ్ గా ఉంటాడని, ఆ తరువాత పరిస్థితుల కారణంగా బిచ్చగాడిలా మారతాడని, నాగ్ అతన్ని వెతుక్కుంటూ వెళతాడని అన్పిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకా 'కుబేర' నుంచి అప్డేట్స్ వచ్చేదాకా ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ఓ పాట మినహా సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మరోవైపు నిర్మాణాంతర పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య