అన్వేషించండి

Krithi Shetty: నాపై ఎందుకంత ద్వేషం? సమాజానికి హాని కలిగిస్తోంది వాళ్లు - కృతి శెట్టి ఆవేదన

Krithi Shetty: ‘ఉప్పెన’లో హీరోయిన్‌గా నటించి చాలామంది ప్రేక్షకులకు బేబమ్మగానే గుర్తుండిపోయింది కృతి శెట్టి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరోయిన్.. తనపై వస్తున్న నెగిటివిటీపై స్పందించింది.

Krithi Shetty: హీరోహీరోయిన్లకు పాపులారిటీ దక్కాలంటే ఒక్క సినిమా చాలు.. ఒకే సినిమా వారికి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టగలదు. అలాగే ఒకే సినిమాను వారిని కనుమరుగు అయిపోయేలా చేయగలదు. అలా ఒక హిట్ తర్వాత వరుసగా ఫ్లాపులను చవిచూస్తూ కనుమరుగయిపోయిన నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం కృతి శెట్టి పరిస్థితి కూడా అలాగే ఉంది. ‘ఉప్పెన’లో బేబమ్మగా నటించి ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది కృతి శెట్టి. ఆ తర్వాత తను చేసిన సినిమాలు ఏవీ తనకు అంతగా హిట్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. తాజాగా తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నటీనటుల జీవితాలపై, తనపై సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీపై స్పందించింది.

అంత ద్వేషం ఎందుకు.?

సోషల్ మీడియాలో అందరూ అంత హార్ష్‌గా మాట్లాడేలా తాను ఏం చేసిందో అర్థం కాలేదని వాపోయింది కృతి శెట్టి. ‘‘ఎవరికైనా అలా చేయడానికి నాలో అంత నెగిటివిటీ లేదు. అందుకే వేరేవాళ్లు అంతలా ఎందుకు రియాక్ట్ అవుతారో నాకు అర్థం కాదు. ఒక యాక్టర్‌గా తమ పని తాము చేసుకుంటున్నప్పుడు వారిపై అంత ద్వేషం ఎందుకు?’’ అని నటీనటులపై జీవితాలపై వస్తున్న ద్వేషం గురించి స్పందించింది కృతి శెట్టి. ‘‘బయట చాలామంది క్రిమినల్స్ ఉన్నారు. వారిపై ఈ ద్వేషమంతా చూపించొచ్చు కదా. అలాంటి వాళ్లు సమాజానికి నిజంగా హాని కలిగిస్తున్నారు. ఎక్కువశాతం నటీనటుల వల్ల అయితే సమాజానికి ఏమీ హాని కలగదు’’ అంటూ నెగిటివిటీ చూపించేవారు ఆలోచించాలని సలహా ఇచ్చింది.

అడగాలనిపిస్తుంది..

‘‘ఎక్కువశాతం నేను అన్ని సందర్భాల్లో పాజిటివిటీతోనే ఉంటాను. కానీ ఏదో ఒక సందర్భంలో బాధ కలుగుతుంది కదా.. నేను కూడా మనిషినే కదా. నాకు కొంచెం స్పేస్ ఇవ్వొచ్చు కదా అని అనిపిస్తుంటుంది. నా గురించి ఏమైనా అన్నా నేను తీసుకుంటాను. కానీ ఒక్కొక్కసారి నా ఫ్యామిలీ మీద కూడా ఇలాంటి కామెంట్స్ చూస్తుంటాను. అది నన్ను చాలా బాధపెడుతుంది. నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడడం వల్ల వారికి ఏం లాభమో అర్థం కాదు. అలా అన్నవారు రియాక్షన్ కోసం ఎదురుచూస్తారు. అప్పుడప్పుడు వెళ్లి వారిని ప్రశ్నించాలని అనిపిస్తుంది. తప్పుడు సమాచారం ఎలా రాయగలుగుతారు అని అడగాలనిపిస్తుంది. నా ఫ్యామిలీ అనే కాదు.. చాలామంది కుటుంబాలపై ఇలాంటివి రాయడం నేను చూశాను. అలాంటప్పుడే మీకు కూడా ఫ్యామిలీ ఉంది కదా అనాలనిపిస్తుంది’’ అంటూ వాపోయింది కృతి శెట్టి.

తమిళంలోనే ఎక్కువ..

‘‘నటీనటులు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి విమర్శలు చేయవచ్చు. అందరూ ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. అలా వారు ప్రతీ పనిలో సక్సెస్‌ఫుల్ అవుతారని లేదు. అయినా కూడా కష్టపడతారు. నటీనటులు కూడా అంతే’’ అంటూ ఫెయిల్యూర్స్‌పై స్పందించింది కృతి. ఈ భామ హీరోయిన్‌గా నటించిన సినిమాల్లో ఒకేఒక్కటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. దాని తర్వాత వరుసగా తనకు ఫ్లాపులే ఎదురయ్యాయి. అయినా కూడా ప్రస్తుతం తన చేతిలో సరిపడా ఆఫర్లు ఉన్నాయి. తెలుగుకంటే ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటిస్తూ కోలీవుడ్‌లో గుర్తింపు సాధించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది కృతి.

Also Read: ఆత్మల మనోభావాలు, యూనిట్ సభ్యుల భయాలు - స్మశాన వాటిక నుంచి ప్రోగ్రామ్ షిఫ్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget