Syamala Devi: ప్రభాస్, అనుష్కల పెళ్లిపై క్లారిటీ - కృష్ణంరాజుతో రెండో పెళ్లిపై శ్యామల దేవి ఆసక్తికర వ్యాఖ్యలు
Syamala Devi: ప్రభాస్, అనుష్కల పెళ్లి గురించి ఇప్పటికీ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. వాటిపై కృష్ణంరాజు భార్య శ్యామల దేవి స్పందించారు. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
Krishnam Raju Wife Syamala Devi: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇప్పటికే ఈ ప్యాన్ ఇండియా స్టార్‌కు పలుమార్లు పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చినా అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. కానీ చాలావరకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం తను హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం ఉంది. ఇప్పటికీ ప్రభాస్, అనుష్క.. ఇద్దరికీ పెళ్లి అవ్వకపోవడంతో వీరిద్దరి పెళ్లిపై వస్తున్న రూమర్స్ ఇంకా ఆగడం లేదు. ఇక తాజాగా ప్రభాస్, అనుష్కల పెళ్లి రూమర్స్‌పై శ్యామల దేవి మరోసారి స్పందించారు. అంతే కాకుండా అసలు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి కృష్ణంరాజును రెండో పెళ్లి చేసుకోవడం గురించి కూడా ఆమె మాట్లాడారు.
వద్దనేవారు ఎవరు.?
‘‘ప్రభాస్, అనుష్క పెళ్లి అని వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్సే. ప్రభాస్ నచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే వద్దనేవారు ఎవరు? అంతా తన ఇష్టం. జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి తను ఎవరినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. తన మనసు చాలా స్వచ్ఛమైనది. వేరేవాళ్లు సంతోషంగా ఉన్నారంటే అది చూసి తను సంతోషపడతాడు’’ అంటూ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు శ్యామల దేవి. కృష్ణంరాజుకు సీతాదేవి అనే మహిళతో ముందే పెళ్లయ్యింది. ఆమె చనిపోవడంతో శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు. ఇక కృష్ణంరాజును రెండో పెళ్లి చేసుకోవడంపై శ్యామల దేవి చాలా పాజిటివ్‌గా స్పందించారు.
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు..
‘‘సీతాదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కృష్ణంరాజు. వాళ్ల అనుబంధం కూడా చాలా గొప్పగా ఉండేది. ఆమె అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం. సడెన్‌గా ఆమె యాక్సిడెంట్‌లో చనిపోయారు. కృష్ణంరాజు జీవితంలో విషాదం ఏదైనా ఉందంటే అదే. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అది చూడలేక ఆయన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోమని అన్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అలా వారిద్దరి మధ్య చాలా చర్చలు జరిగాయట. ఇక వేరే దారిలేక ఆ వయసులో ఆయన తండ్రి తిండి మానేశారట. కృష్ణంరాజు పెళ్లికి ఓకే చెప్పేవరకు తిండి తినను అన్నారట. అప్పుడే నాకు కృష్ణంరాజు సంబంధం వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు శ్యామల దేవి.
నేనే ఒప్పుకున్నాను..
‘‘కృష్ణంరాజుకు రెండో పెళ్లి అని మావాళ్లు కాస్త ఆలోచించారు. కానీ నేను ఇష్టమే అని ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్నానంటే ఆయన నమ్మలేదు. బలవంతంగా ఒప్పించారని అనుకున్నారు. వేరేవాళ్లను పంపిస్తే ఇష్టమే అని చెప్పాను. అలా మా పెళ్లి జరిగింది. ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా మ్యానేజ్ చేస్తానని అందరూ భయపడ్డారు. కానీ నేను వెంటనే కలిసిపోయాను. ఎవరైనా నా గురించి చాలా బాగా చేసుకుంటున్నానని చెప్పేవారు. ఆయన నాకు చాలా నేర్పించారు. ఇప్పటికీ ఇలా బలంగా ఉండే శక్తి ఆయనే నాకు ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు శ్యామల దేవి. కృష్ణంరాజు, శ్యామల దేవికి ముగ్గురు కూతుళ్లు కాగా ప్రభాస్ తండ్రి చనిపోయిన తర్వాత తన బాధ్యతలు కూడా ఈ జంటే చూసుకున్నారు.
Also Read: కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్