అన్వేషించండి

Surekha Konidala: ఆ విషయంలో అస్సలు మొహమాటం లేదు - చిరంజీవి, పవన్ కల్యాణపై సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు!

మెగా బ్రదర్స్ గురించి చిరంజీవి సతీమణి సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పోల్చితే నాగ బాబు అభిరుచులు పూర్తి డిఫరెంట్ గా ఉంటాయని చెప్పారు.

Surekha About Mega Brothers Food Habits: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని తెలుగు ప్రజలు లేరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన ప్రయాణం కొనసాగుతోంది. ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కుర్ర హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఆయన సతీమణి సురేఖ కూడా అందరికీ బాగా తెలుసు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగేందుకు ఆమె వెనుకుండి ముందుకు నడిపించారు. తాజాగా ఆమె కోడలు ఉపాసన సహకారంతో అత్తమ్మ కిచెన్ ను ప్రారంభించారు. సురేఖ కొణిదెల బర్త్ డే సందర్భంగా కొత్త బిజినెస్ ను లాంచ్ చేశారు. మెగా ఇంటి వంటలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇన్ స్టంట్ గా తయారు చేసుకుని పలు రకాల ఫుడ్ ఐటెమ్స్ ను అమ్ముతున్నారు. విదేశాల్లోనూ పులిహోర, రసం, ఉప్మా లాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచారు. 

చిరంజీవి, పవన్ కల్యాణ్ అలా.. నాగబాబు ఇలా..  

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ… మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి భోజనం విషయంలో అస్సలు ఆలోచించరని చెప్పారు. రకరకాల రుచులు కోరుకోరని.. ఏది పెట్టినా తింటారని చెప్పారు. కూరలు లేకుండా చివరకు పచ్చడితో పెట్టిన చక్కగా భోజనం చేస్తారని చెప్పారు. కూర ఏదైనా కడుపు నిండా తింటారని వెల్లడించారు. చిరంజీవి చిన్న సోదరుడు పవన్ కల్యాణ్ కూడా అన్నయ్య మాదిరగానే ఉంటారని చెప్పారు. ఏది పెట్టినా వంకపెట్టకుండా తింటారని చెప్పారు. కానీ, నాగబాబు వ్యవహారం వీరిద్దరికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఆయన భోజనం చేయాలంటే రుచులు కోరుకుంటారని వివరించారు. రకరకాల వంటకాలు ఉంటేనే ఆయనకు నచ్చుతుందని చెప్పారు. అంతేకాదు, తన మామగారు చక్కగా భోజనం చేసే వారని చెప్పారు. ఆయనలా  తినడం ఓ కళ అని, అలా తినే వాళ్లు భోజనం పెట్టడం సంతృప్తిని కలిగిస్తుందన్నారు.   

నాకు వంటలు నేర్పించిన గురువు మా ఆయనే!

నిజానికి తమ ఇంట్లో చిన్నదాన్ని కావడంతో గారాబంగా పెంచారని సురేఖ చెప్పారు. పెళ్లి తర్వాతే వంట నేర్చుకున్నట్లు వెల్లడించారు. వంట చేయడంలో తనకు చిరంజీవి గురువు అని చెప్పుకొచ్చారు. పెళ్లైన కొత్తలో తాను ఉప్మా చేస్తే ఉండలు ఉండలుగా వచ్చిందని, ఎవరూ సరిగా తినలేకపోయారని చెప్పారు. కానీ, ఇప్పుడు అడిగి మరీ తింటారని చెప్పారు.  ఒకప్పుడు వంటలు చేయడం రాని నాకు, ఇప్పుడు చక్కగా వంట చేయడం వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సురేఖ, మెగా బ్రదర్స్ ఆహారపు అలవాట్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Read Also:  హీరోయిన్ సాయి పల్లవిపై ఆర్బీఐ కేసు - ఇదీ అసలు విషయం!

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget