Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్ అట్లీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ - స్టార్ కమెడియన్ ఎంట్రీ?... స్పెషల్ సర్‌ప్రైజెస్ చాలా ఉన్నాయ్
AA22XA6 Movie: బన్నీ, అట్లీ సైన్స్ ఫిక్షన్ మూవీపై మరో క్రేజీ బజ్ తాజాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

Kollywood Star Comedian To Join In AA22XA6 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఏ అప్డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా మరో లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.
స్టార్ కమెడియన్ ఎంట్రీ
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మూవీలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన షూటింగ్‌లో జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించే యోగిబాబు ఈ మూవీలో ఎలాంటి రోల్ చేస్తున్నారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పాత్రను అట్లీ ఎలా డిజైన్ చేశారో అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బన్నీ మూవీలో యోగి బాబు కాంబో డిఫరెంట్ అని... ఆ సీన్స్ హైలెట్ అవుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అందుకే టాలీవుడ్‌కు దూరమయ్యా - అసలు రీజన్ చెప్పిన కమలినీ ముఖర్జీ
స్పెషల్ సర్ ప్రైజెస్
ఈ మూవీలో ఇప్పటివరకూ ఒకే హీరోయిన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ అంటూ అఫీషియల్‌గా ప్రకటించగా... మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఓ పాత్రకు మృణాల్ ఠాకూర్, మరో పాత్రకు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను టీం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా మూవీలో ఓ కీలక రోల్ పోషిస్తారనే ప్రచారం సాగుతోంది. ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం అట్లీ ఆయన్ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరో క్రేజీ న్యూస్ ఏంటంటే... నేషనల్ క్రష్ రష్మికను విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను మరో కీలక పాత్రకు తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బన్నీ, రమ్యకృష్ణ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ.
బన్నీ రోల్ ఏంటి?
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ బన్నీ రోల్ ఏంటి? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన లుక్స్ వైరల్‌గా మారాయి. సమాంతర ప్రపంచం, పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌గా హాలీవుడ్ రేంజ్‌లో సైన్స్ ఫిక్షనల్‌గా మూవీ భారీ స్థాయిలో రూపొందుతోంది. వీఎఫ్ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదివరకు చూడని విధంగా బన్నీ 3 జనరేషన్స్‌లో 4 కీలక రోల్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన సందడి చేయనున్నట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తుండగా... వీఎఫ్ఎక్స్ కోసం హాలీవుడ్‌లో ప్రముఖ కంపెనీలు పని చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






















