Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
ఒక్కసారిగా అక్కినేని నాగచైతన్య వార్తల్లోకి వచ్చారు. శోభితాతో డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో ఆయన్ను ఎవరైనా కావాలని టార్గెట్ చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
'రావణాసుర' విడుదల సందర్భంగా ఆ సినిమాలో హీరో మాస్ మహారాజా రవితేజ, కీలక పాత్రలో నటించిన ఏయన్నార్ మనవడు సుశాంత్‌తో దర్శకుడు హరీష్ శంకర్ ముచ్చటించారు. ఆ ఇంటరాక్షన్ చూస్తే... సుశాంత్ గురించి చెబుతూ '' బేసిగ్గా ఈ ఫ్యామిలీ చాలా సాఫ్ట్ ఫ్యామిలీ'' అని రవితేజ ఓ మాట అన్నారు. అక్కినేని ఫ్యామిలీ ఎంత సున్నితంగా ఉంటారనేది చెప్పడానికి అదొక ఉదాహరణ.
నాగార్జున గానీ, ఆయన కుమారులు లేదా కుటుంబ సభ్యుల పేర్లు గానీ వివాదాల్లో నిలిచిన అరుదు. ఆ మాటకు వస్తే... అక్కినేని ఫ్యామిలీ గొడవలకు దూరంగా ఉంటుంది. అయితే... కింగ్ నాగార్జున కుమారుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)ను కావాలని కొందరు టార్గెట్ చేశారా? అనే అనుమానం అభిమానుల్లో కలుగుతోంది.
మళ్ళీ తెరపైకి డేటింగ్ రూమర్స్
నాగ చైతన్య పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. తెలుగు అమ్మాయి, తెలుగుతో పాటు హిందీ & తమిళ సినిమాల్లోనూ నటిస్తున్న హీరోయిన్ శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala)తో డేటింగ్ రూమర్స్ మళ్ళీ మొదలు అయ్యాయి. ఇటు చైతూ గానీ, అటు శోభిత గానీ తాము డేటింగులో ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. అయితే, వాళ్ళిద్దరూ రెస్టారెంట్లకు వెళ్లిన ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి. ఇటీవల మళ్ళీ ఓ ఫోటో వచ్చింది. దీని వెనుక ఆసక్తికరమైన కథనాలు వినబడుతున్నాయి.
రెండు నెలల క్రితం ఫోటో...
ఇప్పుడు వైరల్ కావడం ఏమిటి?
Naga Chaitanya Sobhita Viral : నాగ చైతన్యతో ఒక రెస్టారెంట్‌లో షెఫ్ ఫోటో దిగారు. అందులో శోభితా ధూళిపాళ కూడా ఉన్నారు. ఓ నాలుగైదు రోజులుగా ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా మంది అది రీసెంట్ ఫోటో అనుకున్నారు. నిజం ఏమిటంటే... అది రెండు నెలల క్రితం దిగిన ఫోటో! అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు వైరల్ కావడం ఏమిటి? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎవరైనా కావాలని టార్గెట్ చేశారా? అని అక్కినేని అభిమానులు కొందరిలో అనుమానాలు ఉన్నాయి.
మళ్ళీ తెరపైకి విడాకుల వ్యవహారం!?
సమంతతో అక్కినేని నాగ చైతన్య ఎందుకు విడిపోయారు? అనేది ఓ మిస్టరీ. ఆ జంటకు సన్నిహితంగా ఉన్న కొందరికి తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళూ ఎప్పుడూ తమ మధ్య గొడవలు ఏమిటనేది బయట పెట్టలేదు. సెలబ్రిటీ కపుల్ కాబట్టి ఆ జంట ఎందుకు విడిపోయారు? అనేది తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకని, విడాకులపై మీడియా కూపీ లాగుతూ ఉంటుంది. ఇటీవల 'శాకుంతలం' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తప్పేమీ లేదని సమంత స్పష్టం చేశారు. పరోక్షంగా చైతన్యది తప్పు అన్నట్లు తేల్చారు.
Also Read : బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట - బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఆట
నాగ చైతన్య, శోభిత రెండు నెలల క్రితం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫోటో ఇప్పుడు వైరల్ కావడం... సమంత వ్యాఖ్యలు చేయడంతో... ఓ సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ మీడియా చైతు మీద వార్తలు వండి వార్చడం మొదలు పెట్టింది. శోభితతో ఆరు నెలలుగా చైతన్య డేటింగ్ చేస్తున్నాడని ఒకరు, ఇంతకు ముందు నాగ చైతన్యతో ఏయే హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ వరుస కథనాలు ప్రసారం చేయడం మొదలు పెట్టింది. ప్రతిదీ చైతన్యను బ్యాడ్‌గా చూపించే విధంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందువల్ల, ఆయన్ను టార్గెట్ చేశారని ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారట.
Also Read : బాలీవుడ్‌కు కాజల్ భారీ పంచ్ - సౌత్‌తో కంపేర్ చేస్తూ గాలి తీసేసిందిగా!