Kishkindhapuri Release Date: 'కిష్కిందపురి' వాయిదా పడలేదు... తేజా సజ్జా 'మిరాయ్'తో పోటీ... పుకార్లకు చెక్ పెట్టిన టీమ్
Kishkindhapuri Trailer Release Date: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన తాజా సినిమా 'కిష్కిందపురి'. విడుదల ఒక్క రోజు వాయిదా పడినట్టు వచ్చిన వార్తలను టీమ్ ఖండించింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ హారర్ సినిమా 'కిష్కిందపురి' (Kishkindhapuri Movie). సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ఎప్పుడో వెల్లడించారు. అయితే ఒక్క రోజు సినిమా వెనక్కి జరిగిందని వార్తలు వచ్చాయి. వాటిని టీం ఖండించింది.
వాయిదా పడలేదు... తప్పించుకోలేదు!
Kishkindhapuri Vs Mirai: సెప్టెంబర్ 12న 'కిష్కిందపురి'తో పాటు తేజా సజ్జా, మనోజ్ మంచు నటించిన 'మిరాయ్' సైతం విడుదల అవుతోంది. అది పాన్ ఇండియా ఫిల్మ్. 'కిష్కిందపురి' రీజనల్ ఫిల్మ్. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఒక్క రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా వెనక్కి వెళ్లిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అందులో నిజం లేదని పరోక్షంగా టీమ్ తెలిపింది.
'వాయిదా వేయలేదు... తప్పించుకోవడం లేదు (నో ఎస్కేప్)... బాక్స్ ఆఫీస్ బరిలో సెప్టెంబర్ 12న దిగుతున్నాం' అని 'కిష్కిందపురి' ప్రొడక్షన్ హౌస్ షైన్ స్క్రీన్స్ పేర్కొంది. 'మిరాయ్'తో పోటీకి రెడీ అయ్యింది.
Also Read: మళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!
No postponement. No escape… On September 12th, fear takes over the box office💥💥💥#Kishkindhapuri 𝐆𝐑𝐀𝐍𝐃 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏𝐓𝐄𝐌𝐁𝐄𝐑 12𝐭𝐡 ❤🔥#KishkindhapuriTrailer out on September 3rd at 11:07 AM❤🔥@BSaiSreenivas @anupamahere… pic.twitter.com/o9nNrSj2Qs
— Shine Screens (@Shine_Screens) September 2, 2025
బుధవారం 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదల!
Kishkindhapuri Trailer Release Date: ఈ బుధవారం (సెప్టెంబర్ 3న) 'కిష్కిందపురి' ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఉదయం 11.07 గంటలకు యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తారు. ఆ విషయం చెప్పడంతో పాటు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు.
'రాక్షసుడు' తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కిష్కిందపురి' సినిమాకు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ





















