Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఇంట వారసుడొచ్చాడు... అబ్బాయి పాదాలను ముద్దాడుతూ భార్యకు థాంక్స్ చెప్పిన హీరో
Kiran Abbavaram's Child Photos: హీరో కిరణ్ అబ్బవరం ఇంట వారసుడు వచ్చాడు. ఆయన భార్య రహస్య పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని సమాచారం.

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి అయ్యారు. మే 22వ తేదీన ఆయన ఇంట వారసుడు అడుగు పెట్టాడు. ఆయన భార్య రహస్య గోరఖ్ (Rahasya Gorak) పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు కిరణ్ అబ్బవరం.
హనుమాన్ జయంతి రోజున...
కిరణ్ అబ్బవరం తన కుమారుడి ఫోటోలను షేర్ చేయలేదు. కానీ, తన చిన్నారి పాదాలను ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు. హనుమాన్ జయంతి రోజున తనకు కుమారుడు జన్మించాడని వివరించారు. 'హ్యాపీ హనుమాన్ జయంతి' అని ఆయన పేర్కొన్నారు. అంతే కాదు... భార్య రహస్యకు ఆయన థాంక్స్ చెప్పారు.
Also Read: వైసీపీ కాదు... 'బాయ్‌కాట్ భైరవం' అంటోన్న మెగా ఫ్యాన్స్... సారీ చెప్పిన దర్శకుడు విజయ్ కనకమేడల
View this post on Instagram
'రాజావారు రాణిగారు' నుంచి...
టాలీవుడ్ ఇండస్ట్రీకి కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన సినిమా 'రాజా వారు రాణి గారు'. అందులో హీరోయిన్ రహస్య గోరఖ్. వాళ్లిద్దరికీ అదే మొదటి సినిమా. ఆ సినిమా చేయడమే కాదు... చిత్రీకరణలో జరిగిన పరిచయం ప్రేమకు, ఆ తర్వాత పెళ్లికి కారణమైంది.
గతేడాది (2024లో) మార్చి 31న కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ వివాహం జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొంత మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహ బంధంతో హీరో హీరోయిన్లు ఒక్కటి అయ్యారు. ఈ ఏడాది జనవరిలో (21వ తేదీన) రహస్య ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేశారు.
పెళ్లి తర్వాత కిరణ్ కెరీర్‌లో భారీ హిట్!
రహస్యతో వివాహమైన తర్వాత కిరణ్ అబ్బవరం ఫిల్మ్ కెరీర్ దూసుకు వెళ్ళింది. ఆయన జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి చేసుకోవడానికి ముందు ఆయన చేసిన 'రూల్స్ రంజన్' ఫ్లాప్ అయ్యింది. అయితే ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ 'క'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమాతో ఆయన భార్య రహస్య నిర్మాత అయ్యారు. ఇప్పుడు మరో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.





















