అన్వేషించండి

Love Today Hindi Remake: ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌కు ముహూర్తం ఫిక్స్ - హీరోహీరోయిన్లుగా స్టార్ల వారసులు

Love Today Remake: తమిళంలో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో ‘లవ్ టుడే’ మూవీ ఓ రేంజ్‌లో హిట్ సాధించింది. ఇప్పుడు బాలీవుడ్‌లోని స్టార్ల వారసులతో ఈ మూవీ రీమేక్ కానుంది.

Love Today Hindi Remake Update: ఒకప్పటితో పోలిస్తే బాలీవుడ్‌లో రీమేక్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయినా కూడా కొందరు మేకర్స్ మాత్రం సౌత్‌లో సూపర్ హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి ‘లవ్ టుడే’. ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో డబ్ చేయగా.. ఇక్కడ కూడా అదే రిజల్ట్ రిపీట్ అయ్యింది. ఇక ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని మేకర్స్ ఎప్పుడో నిర్ణయించుకోగా.. తాజాగా ఈ రీమేక్‌కు సంబంధించి అప్డేట్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఇద్దరూ కొత్తే..

‘లవ్ టుడే’ హిందీ రీమేక్ కోసం ఇద్దరు వారసులు సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె ఖుషి కపూర్ నటించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ యాక్టింగ్‌లో డెబ్యూ ఇచ్చేశారు. ముందుగా ఖుషి కపూర్.. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’తో నటిగా ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇందులో తన యాక్టింగ్ చాలా దారుణంగా ఉందని ప్రేక్షకుల చేత విమర్శలు అందుకుంది. జునైద్ ఖాన్ సైతం ఒక ఓటీటీ ఫిల్మ్‌తో తన యాక్టింగ్ డెబ్యూకు సిద్ధమయ్యాడు. ఇందులో సాయి పల్లవితో జోడీకడుతున్నాడు జునైద్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇది పూర్తయిన వెంటనే ‘లవ్ టుడే’ రీమేక్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు.

నటిగా బిజీ..

‘ది ఆర్చీస్’లో తన యాక్టింగ్‌కు విమర్శలు అందుకున్న ఖుషి కపూర్.. ప్రస్తుతం రెండు ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యింది. ముందుగా సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహిం అలీతో ఒక మూవీ చేయడానికి ఖుషి సిద్ధమయ్యింది. ఇది కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. ఇంతలోనే జునైద్ ఖాన్‌తో ‘లవ్ టుడే’ రీమేక్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇక ఖుషి, జునైద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ రీమేక్.. సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, దీనికి సంబంధించిన షూటింగ్ ఎక్కువగా ఢిల్లీలో జరుగుతుందని మేకర్స్ చెప్తున్నారు.

తక్కువ బడ్జెట్.. పెద్ద హిట్..

‘లవ్ టుడే’ కథను హిందీ ప్రేక్షకులకు నచ్చేలా మార్పులు చేర్పులు చేయడం కోసం స్నేహ దేశాయ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే తను అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’కు కో రైటర్‌గా పనిచేశారు. ‘లాల్ సింగ్ చడ్డా’ ఫేమ్ అద్వైత్ చందన్.. దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఫాంటమ్ స్టూడియోస్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యింది. తమిళంలో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘లవ్ టుడే’ మూవీ ప్రదీప్ రంగనాథన్‌ను దర్శకుడిగా మాత్రమే కాదు నటుడిగా కూడా నిలబెట్టింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన ఇవానా.. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. మరి తమిళంలో అందరినీ మెప్పించిన ఈ సినిమా.. హిందీలో ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. 

Also Read: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న గ్లోబల్ స్టార్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Peddi Collection : సోషల్ మీడియా ట్రెండింగ్‌ పెద్ది - రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్... తెలంగాణలో బుకింగ్స్ ఎప్పుడంటే?
సోషల్ మీడియా ట్రెండింగ్‌ పెద్ది - రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్... తెలంగాణలో బుకింగ్స్ ఎప్పుడంటే?
Moolyam Movie OTT : ఓటీటీలోకి మొగలిరేకులు ఫేం మోహన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మొగలిరేకులు ఫేం మోహన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Lingam Series OTT : ఓటీటీలోకి స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లింగం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లింగం - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget