Khushboo: మీరు బ్లూ ఫీల్మ్స్ చూస్తారా? అందుకే రోజాను అలా అంటున్నారా? ఫ్రూఫ్ ఉంటే రిలీజ్ చేయండి: నటి ఖుష్బూ
బండారు సత్యనారాయణ.. రోజాపై చేసిన కామెంట్స్‌పై ఇప్పటికే పలువురు సీనియర్ నటీమణులు స్పందించారు. తాజాగా ఖుష్బూ మరోసారి ఈ విషయంపై ఫైర్ అయ్యారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీ నేతను మరో పార్టీ నేతలు తిట్టుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు ఆ తిట్లు శృతిమించిపోతాయి. రాజకీయ నాయకుల నోటి నుంచి వచ్చే ఆరోపణలు ఒక్కొక్కసారి ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా బండారు సత్యనారాయణ విషయంలో కూడా అదే జరిగింది. మంత్రి రోజాను తిడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో బ్లూ ఫిల్మ్ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఒక్కసారిగా ఇతర మహిళా రాజకీయాల నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఇప్పటికే సీనియర్ నటి ఖుష్బూ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ కార్యక్రమంలో కూడా ఖుష్బూ ఈ విషయంపై మాట్లాడారు. ‘ఏబీపీ దేశం’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్లూ ఫిల్మ్ చూస్తున్నాను అని చెప్పమనండి..
‘‘బ్లూ ఫిల్మ్ మీ దగ్గర ఉంది అంటే మీరు బ్లూ ఫిల్మ్ చూస్తున్నారు కదా. అందుకే మీకు తెలుసు ఆ అమ్మాయి బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేసింది అని. అది ఎవరు మాట్లాడడం లేదే? అవును నేను బ్లూ ఫిల్మ్ చూస్తున్నాను. అందుకే రోజాను అందులో చూశాను అని ఆయన్ని చెప్పమని చెప్పండి. దీన్ని బట్టి మీరు బ్లూ ఫిల్మ్ చూస్తారు, పొర్న్ చూస్తారు. కానీ ఒక మహిళ గురించి అంత దిగజారి ఎలా మాట్లాడతారని నాకు అసలు అర్థం కావడం లేదు. అది ఒక పురుషుడిగా మీలోని భయాలను, ఓటమిని చూపిస్తుంది. పురుషుడిగా మాత్రమే కాదు.. మొత్తంగా ఒక మనిషిగా కూడా మీరు ఓడిపోయారు. అదే నేను ఖండిస్తున్నాను’’ అంటూ బండారుపై ఫైర్ అయ్యారు ఖుష్బూ.
రాజకీయాలు అంటేనే డర్ట్ ఫీల్డ్
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశంలోని ప్రతీచోట రాజకీయాల్లో మహిళలు ఎదుర్కుంటున్న ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల గురించి మీ స్పందన ఏంటి అని ఖుష్బూను అడగగా.. ‘‘రాజకీయాల్లో ఏదైనా మాట్లాడవచ్చు. ఆలోచనా విధానాలు వేరేగా ఉంటాయి. రాజకీయపరంగా మీరు ఏదైనా చేయవచ్చు. రాజకీయనాయకుడు పనిచేయలేదా? మీ పార్టీ పనిచేయలేదా? మీ లీడర్ పనిచేయలేదా? మీరు మినిస్టర్‌గా ఉన్నప్పుడు మీరు పనిచేయలేదు. ఇక్కడ ఒక మోసం జరిగింది. అక్కడ ఒక గోల్‌మాల్ జరిగింది. అలాంటివి ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఒక అమ్మాయి గురించి అంత అసహ్యంగా మాట్లాడితే మనం తరువాతి తరాలకు ఎలాంటి ఉదాహరణను చూపిస్తున్నట్టు? రాజకీయాలు అంటేనే డర్టీ ఫీల్డ్ అంటుంటారు. ఇలాంటివి మాట్లాడినప్పుడే ఇది డర్టీ ఫీల్డ్ అని అనిపిస్తుంది. ఒక మహిళను పర్సనల్‌గా తక్కువ చేసి మాట్లాడడం, అమర్యాదగా మాట్లాడడం కరెక్ట్ కాదు. క్యారెక్టర్‌ను చంపేసేలా మాట్లాడే హక్కు మీకు ఏ మాత్రం లేదు. ప్రెస్ మీట్‌లో ఒక పురుషుడు అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేశారు.. నా దగ్గర ప్రూఫ్ ఉంది అన్నప్పుడు రిలీజ్ చేయండి’’ అంటూ మహిళలను తక్కువ చేసి మాట్లాడడంపై ఖుష్బూ సీరియస్ అయ్యారు. అలా చేయడం పూర్తిగా తప్పు అని ఖండించారు.
కలిసికట్టుగా ఖండించారు..
రోజా ఎదుర్కున్న ఈ అవమానానికి ఖుష్బూ మాత్రమే కాదు.. రాధిక, మీనా లాంటి ఇతర నటీమణులు కూడా స్పందించారు. అందరూ ఒక్కసారిగా బండారు మీద ఫైర్ అయ్యారు. రోజా భర్త కూడా తన భార్యపై చేసిన వ్యాఖ్యల వల్ల బండారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవడం కామనే అయినా బ్లూ ఫిల్మ్ అనే పదం ఉపయోగించడం అసభ్యకరం అని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.
Also Read: బాలీవుడ్లో మరో ఆఫర్ అందుకున్న రష్మిక - ఆ మీడియం రేంజ్ హీరోకి జోడిగా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial