KGF2 First Review: 'కెజియఫ్ 2'కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన దుబాయ్ క్రిటిక్
Rockstar Yash's much awaited movie KGF Chapter 2 First review out: యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'కెజియఫ్ 2' సినిమాకు దుబాయ్ బేస్డ్ క్రిటిక్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
KGF Chapter 2 Movie Review, Rating: 'కె.జి.యఫ్ 2' సినిమా ఎలా ఉండబోతోంది? ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిది. ఆల్రెడీ 'కె.జి.యఫ్ 1' భారీ విజయం సాధించడం, దానికి కొనసాగింపుగా వస్తున్న 'కె.జి.యఫ్ 2' టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం బావున్నాయి. భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
బుకింగ్స్, ఓపెనింగ్స్ సంగతి పక్కన పెడితే... 'కె.జి.యఫ్ 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ బేస్డ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు సినిమాకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మన దేశంలో ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాను ఆల్రెడీ ఆయన చూశారట. "మొత్తం మీద చెప్పాలంటే... 'కె.జి.యఫ్ 2' భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ఆ యాక్షన్ వర్కవుట్ అవుతుంది. ఇందులో స్టైల్, సబ్‌స్టెన్స్ ఉన్నాయి. యాక్షన్, స్టన్నింగ్ లొకేషన్స్, స్టయిలిష్‌గా తీసిన విధానం పక్కన పెడితే... యష్ ఉన్నాడు. అతడి చరిష్మా మైండ్ బ్లోయింగ్. యష్ బెస్ట్ ఫిల్మ్ ఇది. అందులో డౌట్ లేదు. ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్" అంటూ ఉమైర్ సందు సోషల్ మీడియాలో (KGF Chapter 2 Movie Review) పేర్కొన్నారు. సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ (KGF Chapter 2 Rating) ఇచ్చారు.
#KGFChapter2 Review from Censor Board! #KGF2 is high-octane masala entertainer that stays true to its genre and delivers what it promises: King-sized entertainment. At the BO, audiences will give the film an epic ‘SWAGAT ’ as it is bound to entertain them thoroughly. ⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/QbAbgOv9rQ
— Umair Sandhu (@UmairSandu) April 10, 2022
ప్రతి సినిమాకు ఉమైర్ సందు రివ్యూ ఇస్తారు. అయితే... సినిమా చూడకుండా రివ్యూ ఇస్తాడని, ప్రేక్షకుల్లో నెలకొన్న క్రేజ్ బట్టి సినిమాను చూస్తాడని ఆయన్ను విమర్శించే ప్రేక్షకులు కూడా ఉన్నారు.
Also Read: ప్రభాస్ అభిమానుల ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కె.జి.యఫ్ 2'లో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఈ గురువారం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read: రోజా జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతారా? క్లారిటీ ఇచ్చిన కాబోయే మంత్రి
First Detail Review of #KGF2 from Overseas Censor Board on my Instagram Story ! An Epic BLOCKBUSTER 🌟🌟🌟🌟🌟 ! Link : #KGFChapter2 https://t.co/i4MCt0RGrY pic.twitter.com/d1C5W2qo3L
— Umair Sandhu (@UmairSandu) April 10, 2022
#KGF2 is a monster!!
— Umair Sandhu (@UmairSandu) April 11, 2022
⭐️⭐️⭐️⭐️⭐️