Keerthy Suresh: కీర్తి సురేష్ షాకింగ్ నిర్ణయం - ఆ హీరోతో బోల్డ్ సీన్‌కి గ్రీన్ సిగ్నల్, బాలీవుడ్ వెళ్లాకా రూటు మార్చేసిందా..
Keerthy Suresh Shocking Decision: బాలీవుడ్ వెళ్లాక కీర్తి సురేష్ రూటు మార్చేసింది. ఇప్పటికే బేబీ జాన్ కోసం ఫుల్ గ్లామర్ షో చేస్తున్న ఆమె ఇప్పుడు లిప్‌లాక్‌కి కూడా రెడీ అయ్యిందట.
keerthy suresh lip lock in baby john movie: సౌత్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. దక్షిణాదిన వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఫలితాలతో సంబంధం లేకుండ వరస పెట్టి సినిమాలు చేస్తుంది. తెలుగులో 'దసరా'తో భారీ హిట్ అందుకున్న కీర్తి ఇటీవల సైరన్ మూవీతో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ భామ హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బేబీ జాన్ సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
అయితే కీర్తి గురించిన ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ఈ ముద్దుగుమ్మ ఫుల్ గ్లామర్ షో చేయబోతుందట. ఇప్పటి వరకు అసలు స్కిన్ షో చేయని ఈ బ్యూటీ ఈ చిత్రం ఏకంగా బోల్డ్ సన్నివేశాల్లో కనిపించనుందట. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య డీప్ లీప్‌లాక్ సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాలో పలు చోట్ల కీర్తి సురేష్, వరుణ్ ధావన్ మధ్య లిప్‌లాక్ సీన్స్ ఉండబోతున్నాయట. కథ డిమాండ్ మేరకు ఈ సీన్స్ పెట్టాల్సి వచ్చింది. దీంతో డైరెక్టర్ అట్లీ, నిర్మాతలు ఈ సీన్స్ కంపల్సరీ అని ఇందులో చేయాల్సిందేననీ కీర్తి కండిషన్ పెట్టారట.
మొదట ఈ సీన్‌కి ఒప్పుకోని కీర్తి.. ఈ సీన్ ప్రాధాన్యత గురించి వివరించడంతో ఒప్పుకుందట. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ షో చేయడంపై సౌత్ ఫ్యాన్స్ నుంచి నెగిటివిటీ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య బేబీ జాన్ సెట్ నుంచి కీర్తి ఫోటోలు లీక్ కాగా ఇందులో ఈ అమ్మడు డీప్ నెక్‌లో క్లీవేజ్ షోతో షాకిచ్చింది. దీంతో బాలీవుడ్ వెళ్లగానే ఈ మహానటి రూట్ మార్చేసిందని, అసలు గ్లామర్ షో చేయనని కండిషన్ పెట్టుకున్న ఆమె బి-టౌన్‌లో పెట్టగానే అన్ని మరిచిపోయిందంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు ఏకంగా లిప్‌లాక్ సీన్‌లోనే నటించబోతుందని తెలిసి సౌత్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
ఆఫర్స్ కోసం ఎంతకైనా వెళతావా? దక్షిణాదిలో గిరి గీసుకుని పెట్టుకున్న కండిషన్స్‌ని.. బి-టౌన్‌కి వెళ్లగానే గాల్లో కలిపేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బాలీవుడ్‌లో రాణించాలంటే హీరోయిన్‌లు ఇలాంటి సీన్స్ చేయాల్సిందేనని, కథ డిమాండ్ మేరకు చేస్తే ఏముందంటూ కొందరు ఆమెను సమర్థిస్తున్నారు. కాగా ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బేబీ జాన్ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సౌత్ కీర్తి సురేష్‌కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 'మహానటి' సినిమాలో ఆమె లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు.
Also Read: ప్యాంట్ వేసుకోకుండా వచ్చి పక్కన కూర్చుంటాడు, రణవీర్‌కు అస్సలు సిగ్గులేదు - పరిణీతి చోప్రా
ఈ బయోపిక్‌లో అచ్చం సావిత్రిలా హవభావాలు పలికించి తన నటనతో ఆకట్టుకుంది. ఇందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు గానూ ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఇక సినిమాతో సావిత్ర, సౌందర్య తర్వాత ఈ జనరేషన్‌లో కీర్తి అంటూ కొనియాడారు. ఇప్పటి వరకు తన పరిధిని దాటి కీర్తి గ్లామర్ షో చేయలేదు. తన తొలి చిత్రం 'నేను శైలజ' నుంచి రీసెంట్ 'సైరన్' వరకు అన్ని డిసెంట్ రోల్సే చేసింది. మొన్న నాని 'దసరా'లో అయితే డీ గ్లామర్ రోల్లో పల్లెటూరి అమ్మాయిగా తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. అలా తెరపై తన కట్టు, బొట్టుతో అచ్చమైన తెలుగుంటి అమ్మాయిగా ఆకట్టుకున్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ వెళ్లగానే గ్లామర్ షో, బోల్డ్ రోల్స్ చేస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.