Keerthy Suresh: హిందీలో మహానటికి మరో ఛాన్స్... ఈసారైనా హిట్ కొడుతుందా?
Keerthy Suresh Bollywood Movie: మహానటి కీర్తి సురేష్ మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్నారని సమాచారం. ఆవిడ ఈ సరైన హిట్ కొడుతుందా మరి?

కీర్తి సురేష్ (Keerthy Suresh) మలయాళీ. కానీ కథానాయికగా ఆవిడ కెరీర్ మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొదలైంది. రామ్ పోతినేనికి జంటగా నటించిన 'నేను శైలజ'తో వెండితెరపై అడుగు పెట్టారు మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అలాగే సావిత్రి బయోపిక్ 'మహానటి'తో నేషనల్ అవార్డు కూడా కొట్టేశారు. తర్వాత తమిళ మలయాళ సినిమాలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో కీర్తి స్టార్ హీరోయిన్ ఆ తరువాత హిందీకి వెళ్లారు. అయితే మొదటి సినిమా ఆవిడకు మంచి రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు మరొక బాలీవుడ్ ఆఫర్ కీర్తి సురేష్ తలుపు తట్టినట్లు తెలిసింది.
టైగర్ ష్రాఫ్ జంటగా కీర్తి సురేష్?
దళపతి విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన 'తేరి' సినిమా గుర్తు ఉందా? తెలుగులో 'పోలీస్' పేరుతో విడుదల అయింది. ఈ నెల 23న రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాను హిందీలో వరుణ్ ధావన్ హీరోగా రీమేక్ చేశారు. టైటిల్ 'బేబీ జాన్'. విజయ్ సినిమాలో సమంత పోషించిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో హిట్ అయిన ఆ కథ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. దాంతో హిందీలో కీర్తి సురేష్ తొలి అడుగు సరిగా పడలేదు.
Also Read: Bheems Bollywood Debut: బాలీవుడ్ వెళుతున్న భీమ్స్... అక్షయ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా
'బేబీ జాన్' ఫ్లాప్ అయినప్పటికీ పెళ్లి అయిన కొన్ని రోజులకు ప్రచార కార్యక్రమాలకు హాజరైన కీర్తి సురేష్ కమిట్మెంట్ హిందీ దర్శక నిర్మాతలను చాలా ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఆవిడకు మరొక అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. టైగర్ ష్రాఫ్ కథానాయకుడుగా రూపొందుతున్న యాక్షన్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అని బాలీవుడ్ టాక్. అందులో 'తుపాకీ' ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా ఒక రోల్ చేస్తున్నారట.
Also Read: ఇస్లాంకు వ్యతిరేకంగా 'ద్రౌపది 2' తీశారా? హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం వేటికి సంకేతం?
చిరకాల ప్రియుడు ఆంటోనీతో వివాహం తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేయడం మొదలు పెట్టారు. తెలుగులో విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఒక తమిళ సినిమా, మరొక మలయాళ సినిమా ఆవిడ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది హిందీ వెబ్ సిరీస్ 'అక్క' కూడా చేశారు. త్వరలో అది ప్రేక్షకుల ముందుకు రావచ్చు.





















