Kavya Thapar: గోపీచంద్ సినిమా టైటిల్ కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్
Eagle actress Kavya Thapar upcoming movies: మాస్ మహారాజా రవితేజకు జోడీగా 'ఈగల్'లో నటించిన ఉత్తరాది అమ్మాయి కావ్య థాపర్. తాను చేస్తున్న కొత్త సినిమాల వివరాలు కూడా ఆమె వెల్లడించారు.
కావ్య థాపర్... రాహుల్ విజయ్ 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఉత్తరాది అమ్మాయి. ఆ తర్వాత తమిళ సినిమా చేశారు. కోవిడ్ కాలంలో 'ఏక్ మినీ కథ' అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ శుక్రవారం ఆమెకు ఇంపార్టెంట్. మాస్ మహారాజా రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించిన 'ఈగల్' ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మరి, ఈ సినిమా తర్వాత? ఆవిడ మరో రెండు సినిమాలు చేస్తున్నారు. వాటి వివరాలు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
గోపీచంద్ 'విశ్వం' సినిమాలో నటిస్తున్నా
మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. అందులో కావ్య థాపర్ హీరోయిన్. ఆ విషయం చిత్ర బృందం ఎప్పుడో వెల్లడించింది. అయితే... సినిమా టైటిల్ చెప్పలేదు. ఈ సినిమాకు 'విశ్వం' టైటిల్ ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. ఆ టైటిల్ నిజమేనని కావ్య థాపర్ కన్ఫర్మ్ చేశారు.
'ఈగల్' విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కావ్య థాపర్... తాను గోపీచంద్ 'విశ్వం' సినిమాలో నటిస్తున్నానని, అందులో తనది మంచి క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదని ఆమెకు తెలియదు ఏమో!? మాటల్లో టైటిల్ రివీల్ చేశారు.
రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోనూ నటిస్తున్నా
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు రామ్ పోతినేని సరసన కొత్త హీరోయిన్లను ఎంపిక చేశారు పూరి. ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో ఒకరు కావ్య థాపర్. ఆ సంగతి కూడా ఆమె కన్ఫర్మ్ చేశారు.
Also Read: జగన్ నవ్వారు, అంతే! సీరియస్‌గా తీసుకోలేదు - 'యాత్ర 2' దర్శకుడు మహి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
వచ్చే వారం సందీప్ కిషన్ సినిమాతో...
Kavya Thapar next movie: ఈ శుక్రవారం రవితేజ 'ఈగల్' విడుదల అవుతుంటే... వచ్చే శుక్రవారం మరొక సినిమాతో థియేటర్లలో కావ్య థాపర్ సందడి చేయనున్నారు. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాలోనూ ఆమె ఓ కథానాయికగా నటించారు. ఆ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కానుంది. బ్యాక్ టు బ్యాక్... రెండు వారాల్లో రెండు సినిమాలతో థియేటర్లలో ఆమె కనిపిస్తారు. హిందీ వెబ్ సిరీస్ 'ఫర్జీ'తో పాటు విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు 2' సినిమాల్లో కావ్య థాపర్ నటించారు.
Also Read: ఉపాసన తాతయ్య బయోపిక్ రామ్ చరణ్ చేస్తారా? భర్త గురించి ఉపాసన ఏమన్నారంటే?