అన్వేషించండి

Kasthuri Shankar: ‘లియో’ మూవీలో బూతులపై నటి కస్తూరి హాట్ కామెంట్స్ - విజయ్‌పై సెటైర్లు

‘లియో’ ట్రైలర్ కాంట్రవర్సీపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో కస్తూరి శంకర్ కూడా చేరారు.

‘లియో’ ట్రైలర్‌లో హీరో విజయ్ ఒక బూతు పదాన్ని ఉపయోగించడం, మూవీ టీమ్ దానిని మ్యూట్ చేయకుండా ఆ ట్రైలర్‌ను అలాగే విడుదల చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. తమిళ స్టార్లు ఎక్కడికి వెళ్లినా.. వారికి ఈ విషయంపై ప్రశ్న ఎదురవుతూనే ఉంది. తాజాగా కస్తూరికి కూడా అదే జరిగింది. ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీగా ఉంటూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న కస్తూరి.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ ఇస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు. ఇటీవల కావేరి జలాలపై కస్తూరి స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాల్లో బూతులు మాట్లాడడంపై కూడా తాజాగా స్పందించి మరోసారి సెన్సేషన్ సృష్టించారు.

కులం గురించి కస్తూరి రియాక్షన్..
ఈమధ్యకాలంలో సినిమాల్లో కులాల గురించి మాట్లాడడం, బూతులు ఉపయోగించడం కామన్‌గా మారిపోయింది. మామూలుగా బయట ప్రపంచంలో కులాల గురించి ఓపెన్‌గా మాట్లాడడం అభ్యుదయవాదం అని అంటున్నారు. దీనిపై కస్తూరి రియాక్ట్ అయ్యారు. ‘‘ఎక్కడైనా కులం చూడాల్సిన అవసరం లేనప్పుడు సినిమాల్లోనే ఎందుకు? ప్రస్తుతం తమిళ సినిమాల్లో కులాన్ని ఉపయోగించడం ట్రెండ్‌గా మారిపోయింది. నేను వేదికపై కులాల గురించి మాట్లాడడం అభ్యుదయవాదం అని పిలవడం మానేస్తాను. ఆ ధోరణి చాలా తప్పు’’ అని కస్తూరి చెప్పుకొచ్చారు. ఆపై ‘లియో’ ట్రైలర్‌లో విజయ్ మాట్లాడిన బూతు గురించి కూడా కస్తూరి మాట్లాడారు.

తమిళ సినిమాల్లో ఇంతే..
‘‘తమిళ సినిమాలో అసభ్యపదజాలం, పరుష పదజాలం ఉపయోగించడం కొత్తేమీ కాదు. ఎక్కడో ముఖం లేని నటుడు మాట్లాడే మాటలకు, పాన్-ఇండియన్ నటుడు విజయ్ మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంది’’ అంటూ తమిళ సినిమాలపై ఓపెన్ కౌంటర్ వేశారు కస్తూరి. పైగా విజయ్ లాంటి హీరో ఓపెన్‌గా అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. మామూలుగా కోలీవుడ్‌లో విజయ్‌కు యువకులు ఫాలోయింగ్ ఎంత ఉంటుందో.. యువతుల, మహిళల ఫాలోయింగ్ కూడా అంతే ఉంటుంది. అయితే తమ ఫేవరెట్ హీరో విజయే ఇలాంటి పదాలు ఉపయోగించాడని, తన ఫ్యాన్స్ కూడా అలాంటి పదలు ఉపయోగించడం మొదలుపెడితే బాగుండదు కదా అని కస్తూరి.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘లియో’లో విజయ్ బూతులు మాట్లాడినందుకే ప్రేక్షకులు రియాక్ట్ అయితే.. ఒకప్పుడు ‘మంగాథ’ చిత్రంలో అజిత్ కూడా ఇలాంటి మాటలే ఉపయోగించారు.

లోకేశ్ కనకరాజ్ రియాక్షన్ ఇదే..
‘లియో’ ట్రైలర్‌లో విజయ్ బూతులు మాట్లాడిన సీన్.. ఒక రేంజ్‌లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి లోకేశ్ కనకరాజ్ దీనిపై స్పందించక తప్పలేదు. విజయ్‌కు అలా మాట్లాడడం ఇష్టం లేకపోయినా.. ఆ సీన్‌లో అలా మాట్లాడితేనే ఇంటెన్సిటీ వస్తుందని విజయ్‌ను తానే ఒప్పించానని లోకేశ్ అన్నాడు. పైగా ఈ కాంట్రవర్సీకి పూర్తి బాధ్యత తానే వహిస్తానని చెప్పాడు. అయినా కూడా కాంట్రవర్సీకి బ్రేక్ పడకపోడంతో సినిమాలో ఇది ఉండదని మాటిచ్చాడు. విజయ్ సినిమాపై చెడు మాటలు చెప్పి ప్రజల దృష్టిని ఆకర్షించి ఓపెనింగ్ పొందాల్సిన అవసరం లేదని సీరియస్‌గా చెప్పాడు లోకేశ్ కనకరాజ్.

Also Read: బుల్లితెరపై ‘బ్రో’ సందడి - 54 అడుగుల పవన్ కళ్యాణ్ కటౌట్‌ ఆవిష్కరిస్తున్న ఆ టీవీ చానెల్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget