By: ABP Desam | Updated at : 24 Jun 2022 06:02 PM (IST)
'కార్తికేయ 2'లో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్
యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'కార్తికేయ' సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అదే 'కార్తికేయ 2'. ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయిక. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు (Karthikeya 2 Trailer Out Now).
'కార్తికేయ 2' ట్రైలర్ విషయానికి వస్తే... 'శాంతను! ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధను మాత్రమే, ఆజ్యం మళ్ళీ అక్కడ మొదలైంది. ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలం' అని ఒక నటుడు చెప్పే డైలాగుతో ప్రారంభం అయ్యింది. ప్రాణ త్యాగానికి సిద్ధం కాగల తెగింపు ఉన్న యువకుడిగా నిఖిల్ కనిపించారు. అనుపమా పరమేశ్వరన్ ముసుగులో కనిపించారు. వాళ్ళిద్దరూ ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? అనేది సస్పెన్సులో ఉంచారు. 'అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయన నడిపించడం ఏంటి?' అని నిఖిల్ చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచింది. భక్తి, సైన్స్ నేపథ్యంలో చందూ మొండేటి మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అర్థం అవుతోంది.
'సముద్రం దాచుకున్న అతి పెద్ద సహస్యం ఈ ద్వారకా నగరం' అంటూ నిఖిల్ డైలాగ్‌తో కూడిన 'కార్తికేయ 2' మోషన్ పోస్టర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
India's Epic Adventurous #Karthikeya2 Trailer 1 OUT NOW
⚡ https://t.co/7hg1J1GWQL @actor_Nikhil @anupamahere @AnupamPKher @Actorysr @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/YVoltyh7aw — Eluru Sreenu (@IamEluruSreenu) June 24, 2022
'కార్తికేయ 2'ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ.
Also Read : 'థాంక్యూ' రిలీజ్ డేట్ మారింది - అక్కినేని నాగ చైతన్య థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!
Tollywood: 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ - ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Thalapathy Vijay: మహేష్ బాబు థియేటర్ లో విజయ్ - ఏం సినిమా చూశారో తెలుసా?
Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు