Khaidi 2: కార్తి 'ఖైదీ 2'లో స్వీటీ అనుష్క? - ఆ వార్తల్లో నిజమేంటో తెలుసా... క్లారిటీ వచ్చేసిందిగా..
Anushka Shetty: కార్తి 'ఖైదీ 2' అనుష్క ఓ పవర్ ఫుల్ రోల్ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, దీనిపై డైరెక్టర్ సన్నిహిత వర్గాల నుంచి ఫుల్ క్లారిటీ వచ్చింది.

Anushka Shetty Not Approached For Khaidi 2 Movie: కార్తి హీరోగా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందుతున్న సినిమా 'ఖైదీ 2'. 2019లో విడుదలైన 'ఖైదీ' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవగా.. దీనికి సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ఖైదీ 2లో అనుష్క?
అయితే.. 'ఖైదీ 2' స్వీటీ అనుష్క ఓ కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం గత రెండు రోజులుగా తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియాలో సాగింది. ఇదివరకు ఎన్నడూ లేని పవర్ ఫుల్ రోల్‌లో ఆమె నటించనున్నారని.. దీనిపై మూవీ టీం ఇప్పటికే సంప్రదింపులు జరిపారనే ప్రచారం జోరందుకుంది. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకూ అనుష్కను ఈ మూవీ కోసం ఎవరూ సంప్రదించలేదని.. డైరెక్టర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో వైరల్ అవుతున్న ఆ న్యూస్‌లో నిజం లేదని తేలిపోయింది. అయితే.. గతంలో కార్తి, అనుష్క 'అలెక్స్ పాండియన్'లో జంటగా నటించారు.
ప్రస్తుతం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రజినీ కాంత్ (Rajinikanth) 'కూలీ' మూవీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 14న మూవీ రిలీజ్ కానుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ టీం బిజీగా ఉంది. సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందగా.. కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మిస్తున్నారు.
ఖైదీ గురించి..
లోకేశ్ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. కార్తి 'ఖైదీ'తోనే ఆయనకు స్టార్ డైరెక్టర్ గుర్తింపు వచ్చింది. వరుసగా కమల్ హాసన్‌తో 'విక్రమ్' వంటి హిట్స్ అందుకున్నారు. సినిమాటిక్ యూనివర్స్ అంటేనే లోకేశ్ గుర్తొస్తారు. 'ఖైదీ 2', 'విక్రమ్ 2' ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి. 'కూలీ' రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అనుష్క విషయానికొస్తే.. స్టోరీల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఘాటి'. ఈ మూవీని యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ 'వేదం' తర్వాత ఈ కాంబోలో వస్తోన్న రెండో మూవీ ఇది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జులై 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటే మలయాళంలో 'కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్' చిత్రాన్ని కూడా పూర్తి చేశారు స్వీటీ. వీటి తర్వాత ప్రాజెక్టులను అనుష్క ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.





















